TDP కి భారీ షాక్.. వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి
TDP : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి..టీడీపీ పార్టీని కాదని జగన్ పార్టీ లో చేరి అందరికి షాక్ ఇచ్చాడు.
- By Sudheer Published Date - 03:47 PM, Thu - 17 October 24

అసెంబ్లీ ముందు నుండి వైసీపీ నేతలు (YCP Leaders) ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ లలో చేరుతూ వస్తుండగా..తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి (Mudunuri Murali Krishnam Raju)..టీడీపీ పార్టీని కాదని జగన్ పార్టీ లో చేరి అందరికి షాక్ ఇచ్చాడు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజు వైసీపీ లో చేరారు. ఆయనకు జగన్ (Jagan) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో చేరుతున్న వేళ ముదునూరి ..ప్రజలు ఛీ కొట్టిన పార్టీలో చేరడం ఏంటి అని ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడులో స్థానికంగా ఉన్న పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో టీడీపీ కి గుడ్ బై చెప్పారని తెలుస్తుంది.
2023లో ఏప్రిల్ నెలలో వైసీపీ ని వీడి టీడీపీలో చేరిన ముదునూరి మురళి కృష్ణంరాజు కు టీడీపీ కీలక పదవిని కట్టబెట్టింది, టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గం టిడిపి పరిశీలకుడిగా ఆయనను నియమించారు. కానీ మురళీకృష్ణంరాజు పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఆయన రాకను స్వాగతించని ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు ఆయన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా అలాగే కొనసాగుతుండడం తో ఇప్పుడు మళ్లీ వైసీపీ లోకి వెళ్లకతప్పలేదు.
Read Also : Radhika Apte : తల్లి కాబోతున్న బాలయ్య హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్