TDP : మచ్చలేని నాయకుడు బచ్చుల అర్జునుడు.. సంతాప సభలో విజయవాడ ఎంపీ కేశినేని నాని
రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు సంతాప సభ జరిగింది. ఈ
- Author : Prasad
Date : 18-03-2023 - 7:58 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు సంతాప సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరైయ్యారు. యాదవ సంఘ నాయకులతో కలిసి కీ”శే బచ్చుల అర్జునుడుకి ఎంపీ కేశినేని నాని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. బచ్చుల అర్జునుడు అందరివాడు, మచ్చలేని నాయకుడని,.. ఆయనతో తనకు 2011 నుంచి పరిచయం ఉందని గుర్తు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎనలేని సేవ చేశారని తెలిపారు. సామాన్య రైతు కుటుంబం నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన వ్యక్తి అర్జునుడని.. క్లిష్ట పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని అర్జునుడుకు చంద్రబాబు అప్పచెప్పారన్నారు. కోవిడ్ వల్ల బాధపడిన ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చేసి చంద్రబాబు బచ్చుల అర్జునుడికి మరో జీవితం ఇచ్చారని.. ఆయన మరణం టీడీపీకి తీరని లోటన్నారు. బచ్చుల అర్జునుడు కుటుంబానికి అండగా ఉంటుందని ఎంపీ కేశినేని తెలిపారు.