HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mp Kanakamedala Join Into Bjp

MP Kanakamedala: బీజేపీలోకి టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల‌?

తెలుగుదేశం రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర బీజేపీలోకి వెళుతున్నారంటూ సోష‌ల్ మీడియా కోడైకూస్తోంది.

  • Author : CS Rao Date : 01-08-2022 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kanakamedala
Kanakamedala

తెలుగుదేశం రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర బీజేపీలోకి వెళుతున్నారంటూ సోష‌ల్ మీడియా కోడైకూస్తోంది. ఆయ‌న క్యాసినో కింగ్ చికోటి ప్ర‌వీణ్ ఎపిసోడ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే క‌న‌క‌మేడ‌ల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింద‌ని తెలుస్తోంది. అందుకే, వాషింగ్ పౌడ‌ర్ నిర్మా సూత్రాన్ని క‌న‌క‌మేడల ఎంచుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దేశ విదేశాలలో కాసినోల నిర్వహణ , అసాంఘిక కార్యకలాపాల నిర్వహణలో ఆరితేరిన చికోటి ప్రవీణ్ ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి జూదరులు , అమ్మాయిలని విదేశాలకు తరలించార‌ని తెలుస్తోంది. అంతేకాదు, పెద్ద ఎత్తున హవాలా మార్గంలో లావాదేవీలు నడిపడాన్ని నిగ్గు తేల్చ‌డానికి ఈడీ విచార‌ణ క‌నసాగిస్తోంది. ఈ విచారణ సందర్బంగా బ‌య‌ట‌ప‌డిన క‌న‌మేడ‌ల వ్య‌వ‌హారం టీడీపీని చిక్కుల్లో పడేసింద‌ని ప్ర‌త్య‌ర్థుల ప్ర‌చారం చేస్తున్నారు.

జూదరులను , విలాస పురుషుల‌ను, వారికి సేవలందించేందుకు అమ్మాయిలను పలు విమానాశ్ర‌యాల నుంచి విఐపి పాస్ ల ద్వారా తరలించేవాడు . ఆ క్రమంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లే జూద‌రులు , అమ్మాయిలను ఎయిర్పోర్ట్ ఫ్రొటోకాల్ ఆఫీసర్ రోహ‌న్ ద్వారా త‌ర‌లించే వాడు. రాజ్య‌స‌భ‌ సభ్యుడు కనకమేడల పాస్ ఉపయోగించి ప్రోటోకాల్ తో రోహ‌న్ తీసుకెళ్లార‌ని ఈడీ గుర్తించింద‌ట‌. ప్రవీణ్ తో వ్యాపార భాగస్వామిగా ఉన్న సంపత్ కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. అతని ఖాతా నుండి కనకమేడల ప్రోటోకాల్ ఆఫీస‌ర్ రోహన్ కు పలు దఫాలుగా డబ్బు బదిలీ జ‌రిగింద‌ని ఈడీ అనుమానిస్తోంది. అందుకే, చికోటి ప్రవీణ్ కేసులో కనకమేడల కు సంబంధం ఉందా? అనే ప్ర‌శ్న ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎదురువుతోంది. కనకమేడల ఆదేశాల మేరకే రోహన్ ఎంపీ ప్రోటోకాల్ వాడి చికోటి ప్రవీణ్ తరుపు వాళ్ళను ప్రోటోకాల్ లో తీసుకెళ్లాడ‌ని నిర్థార‌ణ‌కు ఈడీ వ‌స్తుంద‌ట‌.

రోహన్ ఖాతాలో ట్రాన్ప‌ఫ‌ర్ అయిన క్యాష్ తో పాటు న‌గ‌దు పెద్ద మొత్తంలో చేతులు మారిందని ఈడీ అధికారులు అనుమానప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఈ కేసు నుంచి తప్పించుకోవటానికే కనకమేడల హడావుడిగా బీజేపీలో చేరటానికి ప్రయత్నం చేస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోన్న న్యూస్. దీనిపై టీడీపీలోని ఒక కీల‌క వ్య‌క్తిని ప్ర‌శ్నించ‌గా ఇదంతా వైసీపీ వాళ్లు చేస్తోన్న ప్ర‌చారంగా కొట్టిపారేశారు. చికోటితో వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఉన్న సంబంధం బ‌య‌ట‌కు రావ‌డాన్ని క‌ప్పిబుచ్చుకోవ‌డానికి క‌న‌క‌మేడ‌ల ఎపిసోడ్ ను వైసీపీలోని కొంద‌రు క‌ట్టుక‌థ‌ను అల్లార‌ని చెప్ప‌డం కొస‌మెర‌పు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap bjp
  • ap tdp
  • kanakamedala ravindra
  • TDP MP

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • MAHANADU

    TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd