HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mp Baireddy Sabari Speech In Mahanadu

TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Author : Prasad Date : 27-05-2026 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MAHANADU
MAHANADU

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బైరెడ్డి శబరి జాతీయ పార్టీ నివేదికను సమర్పించారు. గత ఐదేళ్లలో ఎదురైన రాజకీయ సవాళ్లను ప్రస్తావిస్తూ.. టీడీపీ పోరాట పటిమను కొనియాడారు. “ఐదేళ్లు గొడ్డలి పార్టీని టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంద‌ని.. కూటమిగా ఎన్నికలకు వెళ్లి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామ‌ని బైరెడ్డి శబరి అన్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయాలని ప్రయత్నించిన ప్రతిసారి పార్టీలో కొత్త యోధులు పుట్టుకొస్తారని ప్రత్యర్థులకు అర్థమైందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని, అండమాన్ వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతోందని పేర్కొన్నారు.

జాతీయ భావాలతో టీడీపీ ఎప్పుడూ ముందుకు సాగిందని.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. “సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని.. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం-2.0 వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ టీడీపీ ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొంటూ.. యువతకు ఉపాధి కల్పనలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. “20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని శ‌బ‌రి తెలిపారు.

లోకేష్ యువగళ పాదయాత్రను ప్రస్తావిస్తూ.. “గొడ్డలి పార్టీకి లోకేష్ పాదయాత్రలో ట్రైలర్ చూపించారు.. తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారు” అంటూ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తుందని.. కార్యకర్తలు డేగ కన్నుతో నిఘా పెట్టి అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • Mahanadu 2026
  • SABHARI
  • tdp
  • TDP MP

Related News

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd