HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Varla Ramaiahs Letter To Ap Dgp

TDP : ఏపీ డీజీపీకి టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య‌ లేఖ.. పోలీసుల‌పై దాడులు చేస్తున్న వైసీపీ నేతల్ని..?

రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల

  • Author : Prasad Date : 13-12-2023 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో అధికారపార్టీ నేతలు పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారనే వార్త ఒక మాజీ పోలీసు అధికారిగా త‌న‌కు బాధకలుగిస్తోందని లేఖ‌లో ప్ర‌స్తావించారు. పోలీసులపై దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయనడానికి నిదర్శనమ‌న్నారు. కడపలో అనిల్ కుమార్ అనే పోలీసు అధికారిపై స్థానిక వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం దుర్మార్గమ‌ని.. అనిల్ కుమార్ భార్య న్యాయం చేయాలంటూ పబ్లిక్‌గా రోధిస్తూ 100కు డెయిల్ చేయడం హృదయవిదారకమ‌న్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో ఇదే కడపలో హైమావతి అనే సర్కిల్ ఇన్ప్సెక్టర్ ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే ఆమెపై దాడికి పాల్పడ్డారని.. బలవంతంగా ఆమె పిర్యాదును వెనక్కు తీసుకునేలా చేశారని లేఖ‌లో పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా మూకవరపాడులో వైసీపీ ఎంపీ బంధువులు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లపై దాడికి పాల్పడ్డారని.. సత్యసాయి జిల్లా, మోటుకుపల్లిలో వైసీపీ ఎంపీపీ భర్త వేణుగోపాల్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డార‌ని తెలిపారు. ధర్మవరం వైసీపీ నాయకులు హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశారని.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసులపై అధికారపార్టీ నాయకులు అనేక దాడులకు పాల్పడ్డారని తెలిపారు.

Also Read:  CBN : శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

అధికారపార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ నాయకులను వెనకేసుకొచ్చే పోలీసు సంఘాలు పోలీసులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులకు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం అధికార పార్టీ నాయకులను వెనకేసుకొస్తూ ప్రతిపక్షాలపై తప్పడు కేసులు నమోదు చేస్తున్న కొంతమంది పోలీసు అధికారులేన‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు వీటిపై స్పందించి ఇటువంటి దుర్మార్గాలను అరికట్టకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలకు పూర్తి విఘాతం కలుగుతుందన్నారు. పోలీసు అధికారులపై దాడులకు పాల్పడిన అధికారపార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని వ‌ర్ల రామ‌య్య డిమాండ్ చేశారు. పోలీస్ బాస్ గా పోలీసు శాఖ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన భాధ్యత డీజీపీపై ఉందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్న నేరస్తులపై కఠిన‌ చర్యలు తీసుకోవాల‌ని డీజీపీని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP DGP
  • Police Officers
  • tdp
  • varla ramaiah
  • ysrcp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd