Payyavula Keshav : రైతులను జగన్ సర్కార్ ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే నిరసన ..అరెస్ట్
- Author : Sudheer
Date : 19-12-2023 - 4:09 IST
Published By : Hashtagu Telugu Desk
రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను (Uravakonda MLA Payyavula Keshav) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) లో నీరు లేక పరిసరాల్లో ప్రాంతాల్లోని పంటలు ఎండిపోతున్నాయని , హంద్రీనీవా కాలువ సమీపంలో జీబీసీ ఉన్నా అధికారులు సాగునీటిని విడుదల చేయడం లేదని… దీంతో మిర్చి పంటలు ఎండిపోతున్నాయని వెంటనే నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున రైతులు రోడ్ల పైకివచ్చి ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతు తెలుపుతూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సైతం రోడ్డెక్కరు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఆయన్ను ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్టు సమయంలో రైతులు వర్సెస్ పోలీసుల మధ్య తీవ్రతోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. పయ్యావుల కేశవ్‌ను అరెస్టు చేసేందుకు రెండు గంటల పాటు పోలీసుల తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగునీరు అడిగితే తమ ఎమ్మెల్యే పయ్యావులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్చి పంటలకు సాగునీరు ఇచ్చే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
Read Also : Congress : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం