HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Beeda Ravi Chandra Comments On Ycp Leaders

TDP vs YCP : ద‌మ్ముంటే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ నేత‌లు రావాలి – టీడీపీ నేత బీద ర‌విచంద్ర‌

  • Author : Prasad Date : 16-09-2023 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beeda Ravichandra
Beeda Ravichandra

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో రిమాండ్‌లో ఉన్నారు. అయితే అస‌లు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో స్కామే జ‌ర‌గ‌లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో టీడీపీ నేత‌లు వ‌రుస‌గా దానిపై ప్ర‌జెంటేష‌న్ ఇస్తున్నారు. 42 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల సందర్శనకు వైసీపీ మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, సాక్షి మీడియాని, వైసీపీ అనుబంధ మీడియాని స్వాగతిస్తున్నామ‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీద ర‌వించంద్ర స‌వాల్ చేశారు. రండి కలిసి పర్యటిద్దాం.. అక్కడ ఉన్న వాస్తవాలను తెలుసుకుందామంటూ ఆయ‌న వైసీపీ నేత‌ల‌కి స‌వాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన సెంట్రల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లేనే లేవంటున్నవారు ఢీల్లీకి వచ్చి నిర్ధారించుకోగలరా? అని ప్ర‌శ్నించారు. సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి, ప్రేమ్ చంద్రారెడ్డిలతో కలిసి అన్ని సెంటర్లు తిరుగుదాం.. రాగలరా? అని స‌వాల్ చేశారు. కేంద్రం ఇచ్చిన సెంటర్లు లేనే లేవనడం విడ్డూరంగా ఉంద‌ని.. ఇంకా పలు వాస్తవాలను అవాస్తవాలని మాట్లాడుతున్నవారు కూడా త‌మ‌తో రావాలని కోరారు.

ఈ ప్రపంచానికి రథసారధులైన యువత జీవితాలను ఈ ప్రభుత్వం బుగ్గిపాలు చేస్తోందని బీద ర‌విచంద్ర మండిప‌డ్డారు. ప్రతిభ ఉన్న యువత బతుకులను ఛిద్రం చేస్తున్నార‌ని..ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారని ఆయ‌న ఆరోపించారు. యువతకు బంగారు భవిష్యత్తును ఇవ్వాల్సిందిపోయి వారి అభివృద్ధికి నిరోధకులుగా వైసీపీ ప్ర‌భుత్వం మారింద‌న్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా యువతకు అండగా నిలవాల్సింది పోయి గుదిబండగా మారింద‌న్నారు. మేధావులు, పారిశ్రామికవేత్తలను కూడా ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని… చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేయడం కరెక్టు కాదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందని పదే పదే ప్రభుత్వం అసత్యపు ప్రచారం చేస్తోందని..స్కిల్ డెవలప్ మెంట్ కు నిధులు విడుదల కావడం అబద్ధమా? ఎక్స్ లెంట్ సెంటర్స్, ట్రైనింగ్ సెంటర్స్ 42 ఉండటం అబద్ధమా? ఈ సెంటర్స్ ని విజిట్ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్ర‌శ్నించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీడియాతో సెంటర్స్ కు వచ్చేందుకు సిద్ధమా? అని మ‌రోసారి స‌వాల్ చేశారు. ఈ సెంటర్లలో పరిరకరాలు ఉన్నాయా లేదా అని చూడటానికి వెళ్లేవారిని ఎందుకు ఈ ప్రభుత్వం అండ్డుకుంటోంద‌ని బీద ర‌వించంద్ర ప్ర‌శ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు నిర్వహించే యూనివర్శిటీ, కాలేజీలను బెదిరిస్తున్నార‌ని.. 42 సెంటర్ లకుసాఫ్ట్ వేర్, హార్ట్ వేర్ పరికరాలు అందాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చారని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ నాయకులు అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారని.. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ లలో భాగమైన 36 ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్లు, 6 స్కిల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ లెన్సీ సెంటర్ల సందర్శనకు ప్రభుత్వాధికారులు రావాలని పిలుపునిస్తున్నామ‌న్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం లేని అవినీతి గురించి ప్రచారం చేయడం, గందరళోళం సృష్టించడం మానాలని లేదంటే భవిష్యత్తులో వీరికి ప్రజల చేతిలో ఇబ్బందులు తప్పవని బీద ర‌విచంద్ర తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap Skill Development Scam
  • beeda ravichandra
  • Chandrababu - Bail
  • tdp

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd