AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు
- Author : Sudheer
Date : 30-01-2024 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
వైస్ షర్మిల (Sharmila)కు ప్రాణహాని ఉందని..వెంటనే ఆమెకు భద్రత పెంచాలని కోరారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu).
సీఎం జగన్ (Jagan)కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని, రాజకీయాల్లో ఎదురుచూస్తున్న షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని సంచలన ఆరోపణలు చేసారు అయ్యన్న. షర్మిలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు. అది జగన్ ఇవ్వట్లేదని చెప్పారు అయ్యన్నపాత్రుడు. తనకు కూడా ప్రాణహాని ఉందనీ.. రివాల్వర్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. గన్‌మెన్ ఇస్తామని ఎస్పీ చెప్పారనీ.. కానీ నిరాకరించినట్లు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ సందర్బంగా వైసీపీ నేతల ఫై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నేతలు భూములు కనిపిస్తే బెదిరించి లాక్కుంటున్నారని అయన్న పాత్రుడు ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారని సభ పెట్టారు? ప్రశ్నించారు. విశాఖ బీచ్ రోడ్డు నుంచి భీమిలి వెళ్లే వరకు ప్రభుత్వ భూములను ఏమైనా మిగిల్చారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు ఎందుకు మీకు ఓట్లేయాలి? ప్రశ్నించారు. భూములు దోచుకున్న వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రశస్తే లేదని హెచ్చరించారు. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామన్నారు. ఎన్నికల తర్వాత జగన్ లండన్, అమెరికాలో దాక్కున్నా లాక్కొచ్చి.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు.
Read Also : Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ