TDP-Janasena : టీడీపీ,జనసేన సీట్లు ఎవరికెన్ని.? బాబు, పవన్ లెక్క ఇదేనా?
చంద్రబాబు,జనసేనాని( TDP-Janasena)పవన్ మధ్య జరిగిన భేటీ ఊహాగానాలకు తావిస్తోంది.
- Author : CS Rao
Date : 10-01-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని ( TDP-Janasena) పవన్ మధ్య ఒకటిన్నర గంట పాటు జరిగిన భేటీ పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఆ భేటీ ముగిసి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ వాళ్లిద్దరి మధ్యా జరిగిన చర్చల మీద ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఈక్వేషన్లను(Sharing) వినిపిస్తున్నారు. ప్రెస్ మీట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాల మీద యుద్ధం చేయడమే ఉమ్మడి లక్ష్యమని ఇద్దరూ( TDP-Janasena) ప్రకటించారు. అయితే, ఎవరూ వాళ్లు చెప్పిన దాన్ని నమ్మడం లేదు. ఒకడుగు ముందుకేసి జనసేన సానుభూతి మీడియా సీట్ల షేరింగ్ (Sharing) నుంచి, స్థానాల పంపిణీ వరకు వెళ్లింది.
జనసేన సానుభూతి మీడియా ఫోకస్ ( TDP-Janasena)
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలను డిమాండ్ చేసినట్టు జనసేన సానుభూతి మీడియా ఫోకస్ చేస్తోంది. కానీ, 25 అసెంబ్లీ , 3 లోక్ స్థానాలకు చంద్రబాబు అంగీకరించినట్టు ప్రచారం చేస్తోంది. ఇదంతా అబద్ధమని టీడీపీ సానుభూతి మీడియా కొట్టిపారేస్తోంది. అంతేకాదు, అనంతపురం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలు, ఉత్తరాంధ్రలోని నియోజకవర్గాలు కేటాయించామని జనసేన కోరుతుందట. ఏడాది ముందుగానే జనసేనకు ఇవ్వాల్సిన నియోజకవర్గాలపై ఒక అవగాహనకు వచ్చారని, ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలను కూడా అందుకే నియమించలేదని జనసేనలోని ఒక వర్గం భావిస్తోంది.
Also Read : Nellore TDP : వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలి – టీడీపీ నేత చేజర్ల
వాస్తవంగా గత 175 స్థానాల్లో పోటీ చేసే బలం టీడీపీకి ఉంది. కానీ, కాపు ఓట్ల కోసం జనసేన మద్ధతును చంద్రబాబు కోరుకుంటున్నారు. ఆ మేరకు పలు సందర్భాల్లో ఆయన లీకులు ఇచ్చారు. కుప్పం కేంద్రంగా ఒన్ సైడ్ లవ్ కామెంట్ నుంచి విజయవాడలోని ఒక హోటల్ కు వెళ్లి పవన్ కు సంఘీభావం ప్రకటించిన చంద్రబాబు తీరు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని అర్థం అవుతోంది. కానీ, టీడీపీలోని ఒక వర్గం మాత్రమే జనసేన పొత్తును నిరాకరిస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ మూలాలు దెబ్బతింటాయని లెక్కిస్తోంది. కాపులకు బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చేసిన తీర్మానం 2019 ఎన్నికల్లో టీడీపీ కొంప ముంచింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ జనసేన పొత్తు వద్దనే వాళ్లు ఎక్కువగా టీడీపీలో ఉన్నారు.
టీడీపీకి సాలిడ్ గా ఉండే బీసీ ఓట్లు
మునుపెన్నడూ లేని విధంగా 40ఏళ్ల టీడీపీ చరిత్రలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల్లో టీడీపీ పరిమితం అయింది. దానికి కారణం టీడీపీకి సాలిడ్ గా ఉండే బీసీ ఓట్లు చీలిపోవడం ప్రధాన కారణం. పైగా జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్ట్ లు కలిసి పోటీ చేసినప్పటికీ ఆ కూటమికి వచ్చిన ఓటు బ్యాంకు కేవలం 5శాతం మాత్రమే. దానిలో జనసేన వాటా ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా లాభం కంటే నష్టం ఎక్కవగా ఉంటుందని లోకేష్ అండ్ టీమ్ చేసిన సర్వేల్లో తేలిందట. కానీ, చంద్రబాబు మాత్రం జనసేన వైపు ముందడుగు వేస్తున్నారు. అయితే, 15 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను ఇవ్వడానికి మాత్రమే టీడీపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అందుకు భిన్నంగా జనసేన సానుభూతి మీడియా విభిన్నంగా ప్రచారం చేస్తోంది. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ ఒకసారి, రాజ్యాధికారం జనసేనదే నంటూ మరోసారి చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల షేరింగ్ గురించి చంద్రబాబు, పవన్ మధ్య చర్చకు వచ్చిందని చర్చ జరుగుతూ ఉండడం విచిత్రం.
Also Read : Pawan Kalyan: పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ.. ఏం మాట్లాడారంటే?