AP : టీడీపీ, జనసేన సూపర్ హిట్.. వైసీపీ అట్టర్ ఫ్లాప్ – చంద్రబాబు
- By Sudheer Published Date - 08:29 PM, Wed - 28 February 24

టీడీపీ – జనసేన (TDP-janasena) ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టారు. ఈరోజు బుధువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల ప్రతిపాడు వద్ద జెండా (Jenda Meeting) పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు ఇరు పార్టీల అధినేత , పార్టీ నేతలు , కార్యకర్తలు ఇలా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు భారీ డైలాగ్స్ పేలుస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు.
టీడీపీ, జనసేన కూటమిని సూపర్ హిట్‌గా అభివర్ణించిన చంద్రబాబు (Chandrababu).. వైసీపీ ఐదేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ రౌడీలకు 40 రోజుల్లో రియల్ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ‘ప్రశాంతమైన రాష్ట్రంలో జగన్ అగ్గిరాజేశాడు. అదే అగ్గితో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైసీపీని తగలబెడతారు. పవన్ కళ్యాణ్ లాంటి వాయువు కూడా తోడయ్యారు. ఇక వైసీపీ బుగ్గి అవుతుంది. త్వరలో BC డిక్లరేషన్, టీడీపీ-జనసేన మేనిఫెస్టో ప్రకటిస్తాం. ఒక పార్టీ వెనుక మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్నాయి’ అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలని అమరావతి రాజధానికి ప్రణాళిక సిద్ధం చేశామన్న చంద్రబాబు.. జగన్ సీఎం అయ్యాక అరాచకపాలనతో నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారన్న చంద్రబాబు.. మహానటుడు చిరంజీవిని సైతం అవమానించారని అన్నారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సొంత చెల్లెలు షర్మిలను సైతం తరిమేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ అరాచకాలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్న చంద్రబాబు.. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు సీక్వెల్ ఉండదనీ, అలాగే వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేదీ ఉండదని అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపీ దొంగలపై టీడీపీ-జనసేన శ్రేణులు పోరాడాలని సూచించారు.
తాడేపల్లిగూడెం సభ చరిత్ర తిరగరాసే సభ అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ గతంలో 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారన్నారు. ఒక్క రోజుల్లోనే అంతా సర్దుకొని పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు సూపర్ హిట్ #TeluguJanaVijayam #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance#AndhraPradesh pic.twitter.com/pG04wSTMmk
— Telugu Desam Party (@JaiTDP) February 28, 2024
Read Also : Pawan Kalyan : సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం – పవన్ కళ్యాణ్