Nara Lokesh : సరైన టైములో లోకేష్ ను రంగంలోకి దింపబోతున్న టీడీపీ ..?
Nara Lokesh : 2019లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా అక్కడే స్థిరంగా పనిచేశారు. ఐదేళ్లపాటు ప్రజలతో మమేకమై పని చేయడం ద్వారా 2024లో ఘన విజయం సాధించారు.
- By Sudheer Published Date - 09:37 PM, Sat - 17 May 25

ప్రస్తుతం ఏపీలో టీడీపీకి పూర్తి స్థాయిలో పూర్వ వైభవం వచ్చింది. ఈ సమయంలోనే యువనేత లోకేష్ (Nara Lokesh) కు పార్టీలో కీలక పదవి అప్పగించాలని పార్టీ నేతలు, శ్రేణులు , అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాది మహానాడు కార్యక్రమం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan) సొంత జిల్లాలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడు(Mahanadu)లో కీలక రాజకీయ తీర్మానాలు జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ భవిష్యత్ నాయకత్వానికి పునాదులు వేసే విధంగా ఈ మహానాడు ఉండబోతోంది. లోకేష్‌కి పార్టీ పరంగా అధికారిక ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Tata Sierra: ఆగస్టులో లాంచ్ కానున్న కొత్త టాటా సియెర్రా.. ధర ఎంతంటే?
ప్రత్యక్ష రాజకీయాల్లో 2014లో అడుగుపెట్టిన నారా లోకేష్.. అప్పటి నుంచి పార్టీకి సేవలందిస్తూ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. 2019లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా అక్కడే స్థిరంగా పనిచేశారు. ఐదేళ్లపాటు ప్రజలతో మమేకమై పని చేయడం ద్వారా 2024లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు పార్టీలో చురుకుగా వ్యవహరిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీలో ఉన్న తరుణంలో నాయకత్వ బాధ్యతల్ని అతి సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అందుకే లోకేష్‌ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవికి నియమించే అవకాశాలపై పార్టీ వర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది.
యువతలో లోకేష్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, టిడిపిలో ఆయన పాత్రను మరింత బలోపేతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యావంతులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఐటీ, విద్యాశాఖల్లో లోకేష్ వినూత్న పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వం లో డిప్యూటీ సీఎం పదవి పై చర్చలు ఉన్నా, ముందుగా పార్టీలో తన స్థానం బలపరిచే దిశగా మహానాడు కీలకంగా నిలవనుంది. మొత్తానికి ఈ మహానాడు ద్వారా టిడిపి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండటంతో పాటు, లోకేష్‌కు పార్టీ నాయకత్వంలో అగ్రస్థానం కల్పించే చరిత్రాత్మక వేదికగా నిలవబోతోంది.