TDP : నేడు నారా లోకేష్ అధ్యక్షతన జరగనున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. భవిష్యత్ కార్యచరణపై చర్చ
నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మంగళగిరిలోని
- Author : Prasad
Date : 21-10-2023 - 10:01 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటు జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో జనసేనతో సమన్వయంతో టీడీపీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయటంపై సమావేశంలో చర్చించనున్నారు. “నిజం గెలవాలి పేరిట” నారా భువనేశ్వరి యాత్రపై సమావేశంలో చర్చ జరగనుంది. చంద్రబాబు అరెస్టుతో ఆగిన కార్యక్రమాలు లోకేష్ పునరుద్ధరణ చేయాలని .. “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నారా లోకేష్ పునఃప్రారంభంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బాబుతో నేను కార్యక్రమం కొనసాగింపుపై సమావేశంలో చర్చ జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటర్ వెరిఫికేషన్, పార్టీ సంస్థాగత నిర్మాణం అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సమావేశం ప్రారంభంలో చంద్రబాబు అరెస్టుతో ఆవేదనతో మృతిచెందిన వారికి టీడీపీ నేతలు నివాళులర్పించనున్నారు.
Also Read: CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం