AP Transfers : ఏపీలోనూ ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.. చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
- By Pasha Published Date - 03:56 PM, Sat - 15 June 24

AP Transfers : ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారిని అప్రాధాన్య పోస్టులకు పంపి.. సమర్థులైన ఆఫీసర్లకు కీలక పోస్టింగ్‌లను కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. శనివారం ఉదయం తన నివాసంలో సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, సీఎంవో అధికారులతో జరిగిన భేటీలో ఈ అంశంపై చంద్రబాబు(AP Transfers) చర్చించినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
- వైఎస్ జగన్ హయాంలో వైఎస్సార్ సీపీకి అత్యంత అనుకూలంగా వ్యవహరించిన అధికారుల జాబితాను చంద్రబాబు సిద్ధం చేయించుకున్నట్లు సమాచారం.
- ప్రవీణ్ ప్రకాశ్, శశి భూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంటుకు (జీఏడీ) రిపోర్ట్ చేసేలా త్వరలోనే ఆదేశాలు ఇస్తారని అంటున్నారు.
- సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్.సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిని ట్రాన్స్‌ఫర్ చేసే ఛాన్స్ ఉంది.
- జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకునే దిశగా యాక్షన్ ప్లాన్‌ను అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.
Also Read :Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం
- చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై వేగవంతంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
- సీఎంవో ఆదేశాల అమలులో జాప్యం జరగకుండా చూడాలని నిర్దేశించారు. ఈ అంశాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
- టీటీడీ ప్రక్షాళనతో చంద్రబాబు తన సంస్కరణల పర్వాన్ని మొదలుపెట్టారు. టీటీడీ ఈవో పదవి నుంచి ధర్మారెడ్డిని తప్పించి.. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు ఆ బాధ్యతలు అప్పగించారు.
- టీటీడీలోని అన్ని విభాగాల్లోనూ కీలకమైన మార్పుల దిశగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోనున్నారు.