TDP Teenmar : టీడీపీ “తీన్మార్”.. పట్టభద్రుల ఎన్నికల్లో “దేశం” జైత్ర యాత్ర
ఏపీలో అధికార వైసీపీకి మేధావులు, విద్యావంతులు షాక్ ఇచ్చారు. ఏపీలో ఎన్నడూ లేనంతా సంక్షేమాన్ని తామే చేస్తున్నామని
- By Prasad Published Date - 07:48 PM, Sat - 18 March 23

ఏపీలో అధికార వైసీపీకి మేధావులు, విద్యావంతులు షాక్ ఇచ్చారు. ఏపీలో ఎన్నడూ లేనంతా సంక్షేమాన్ని తామే చేస్తున్నామని నాలుగేళ్లుగా ఊదరగోడుతున్న సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. తొమ్మిది జిల్లాల్లోని 108 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా టీడీపీ అభ్యర్థులకే మద్దతు పలికారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఇటు పశ్చిమ రాయలసీమలో మాత్రం టీడీపీ – వైసీపీల మధ్య హోరా హోరీ నడిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి స్పష్టత రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు మూడో రోజు కొనసాగింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఆధిక్యత రావడంతో ఆయన విజయం ఖరారైంది. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ గెలవడంతో క్యాడర్‌లో జోష్ మొదలైంది. ఇప్పటి వరకు అక్రమకేసులు, అధికార పార్టీ నేతల దాడులతో ఇబ్బందులకు గురైన క్యాడర్‌కి ఈ గెలుపు బూస్టింగ్‌ని ఇచ్చింది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. సీఎం సొంత జిల్లాలో సైతం టీడీపీకి మెజార్టీ రావడం వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. పట్టభద్రులంతా సీఎం జగన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడానికి నిదర్శనమే ఈ ఫలితాలు.పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు తెలిపారు. నియంతృత్వ పోకడలతో వెళ్లినవారంతా మట్టికరిచిపోయారని.. రాబోయే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉంటుందో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారన్నారు.

Related News

TDP Foundation Day: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం, NTR టు CBN
హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. తెలుగోడి ఆత్మగౌరవ కోసం పుట్టింది. ఓ ప్రభంజనంలా తెలుగువాడి తట్టింది.