Horse Ride: గుర్రంపై రోజూ స్కూల్‌కి వెళుతున్న విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే..?
ప్రయాణ సౌకర్యం లేక ఇప్పటికీ చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. స్కూల్ లేదా హాస్పిటళ్లకు వెళ్లేందుకు రోడ్లు, బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
- By Nakshatra Published Date - 09:08 PM, Tue - 10 January 23
Horse Ride: ప్రయాణ సౌకర్యం లేక ఇప్పటికీ చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. స్కూల్ లేదా హాస్పిటళ్లకు వెళ్లేందుకు రోడ్లు, బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజలకు అత్యవసరమైన సౌకర్యాలు కూడా గ్రామాల్లో ఉండటం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ముగిసినా.. ఇప్పటికీ చాలా గ్రామాలకు కరెంట్ లేదా మౌలిక అవకాశాలు కూడా లేవు.
తాజాగా స్కూల్‌కి వెళ్లేందుకు బస్సు సౌకర్యం, రోడ్లు లేకపోవడంతో గుర్రంపై విద్యార్థులు స్కూల్ కి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా సబ్ ప్లాన్ ఏరియాలో జరిగింది. రావికమతం మండలం గిరిశిఖర గ్రామామైన నేరేడుబందకు చెందిన విద్యార్థులు గుర్రాలపై స్కూల్ కి వెళుతున్నారు. ఓ సామాజిక కార్యకర్త వీటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ గ్రామంలోని 15 మంది విద్యార్థులు పక్క విలేజ్ లోని స్కూల్ కు వెళుతున్నారు. అయితే స్కూల్ కి వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. అంతేకాకుండా ఎలాంటి ప్రయాణ సౌకర్యం అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులు రోజూ స్కూల్ కి వెళ్లడానికి గుర్రాలు ఆశ్రయిస్తున్నారు. ఒక్కొ గుర్రంపై ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు వెళుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామానికి రోడ్డు వేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తోన్నారు.
తమ గ్రామానికి ఎప్పటింనుచో రోడ్డు లేదని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తోన్నారు.
Related News
CM Ramesh : ఏ ఒక్కడిని వదిలిపెట్టనని సీఎం రమేష్ వార్నింగ్..
తనపై దాడి చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టానని..హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని రమేష్ సవాల్ చేసారు.