Assembly : తప్పు చేయాలంటేనే భయపడేలా కఠిన చర్యలు : మంత్రి లోకేశ్
టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు డిమాండ్ మేరకు ఏయూలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ వేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 60 రోజల్లో విజినెన్స్ నివేదిక ఇవ్వనుంది. నివేదిక రాగానే నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
- By Latha Suma Published Date - 12:17 PM, Thu - 13 March 25

Assembly : గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ ప్రారంభం కాగానే ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ వారికి సమాధానమిచ్చారు. ఏపీలోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని లోకేశ్ అన్నారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Read Also: Phone : మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. ఇలా చెయ్యండి ఈజీగా దొరికేస్తుంది
టీడీపీ, బీజేపీ, జనసేన సభ్యులు డిమాండ్ మేరకు ఏయూలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ వేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 60 రోజల్లో విజినెన్స్ నివేదిక ఇవ్వనుంది. నివేదిక రాగానే నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ఉంటాయన్నారు. విజిలెన్స్ రిపోర్టును సభ్యులకు అందజేస్తామన్నారు. ప్రపంచంలోని టాప్ 100లో ఏయూ ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి చెప్పారు. సంస్కరణలో భాగంగా ఐఐటీ ఖరగ్‌పూర్ మేథ్స్ ప్రొఫెసర్ రాజశేఖర్‌ను ఏయూ వీసీగా నియమించామన్నారు.
ఇక, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. గతంలో ఏయూ వైసీపీ కార్యాలయంగా మారిందన్నారు. ఇక్కడ కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. ఆ నిధులను జగన్ విశాఖ వచ్చినట్టు మూడు హెలిపాడ్లు తయారు చేయాలని ప్లాన్ వేశారన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన చెట్లను సైతం నరికేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు అవుతున్నా ఇంకా ఉపేక్షించడం తగదన్నారు. నిర్దిష్ట కాలపరిమితితో విచారణను వేగవంతం చేయాలని ఆయన కోరారు.
మరో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. విచారణ కమిటీకి నిర్థిష్టమైన కాల పరిమితి ఉండాలన్నారు. ఆ తర్వాత శిక్షలు కఠినంగా ఉండాలన్నారు. వైసీపీ హయాంలో యూనివర్సిటీలు రాజకీయాలకు అడ్డాగా మారాయన్నారు. నిందితులపై కఠినమైన చర్యలు ఉండాలన్నారు. కచ్చితంగా విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి వైకాపా అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని ఆరోపించారు. ఎంతో పేరున్న ఏయూను రాజకీయ వేదికలా ఆయన మార్చారని ఆక్షేపించారు. ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.
Read Also: HYD Metro Rail : నిషేధిత వస్తువులు గురించి ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలు