HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Special Recognition For Suryakantham Post Office Special Envelope

Suryakantham: గయ్యాళిఅత్తకు అరుదైన గుర్తింపు.. తపాలాశాఖ ప్రత్యేక కవరు!

తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా, గయ్యాలి అత్తగా పేరుగాంచిన డాక్టర్‌ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల కానుంది. ఈ నెల 18న దీనిని ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ డీఎస్‌యూ నాగేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • Author : Balu J Date : 16-11-2021 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా, గయ్యాళి అత్తగా పేరుగాంచిన డాక్టర్‌ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల కానుంది. ఈ నెల 18న దీనిని ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ డీఎస్‌యూ నాగేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె కాకినాడకు చెందినవారు. తెలుగు వెండితెరపై గయ్యాళి అత్తయ్యగా పేరుపొందిన ఈ నటీమణి పేరున కాకినాడలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి MP వంగా గీత, MLA ద్వారంపూడి, మేయర్‌ శివప్రసన్న, విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ M వెంకటేశ్వర్లు హాజరవనున్నారు.

సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పురం ఆమె స్వస్థలం. ఆరేళ్ళ ప్రాయంలోనే నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. హిందీ పాటలు వింటూ చక్కగా నృత్యం చేసేవారు సూర్యకాంతం. అది చూసి సమీపబంధువులు కొన్ని ప్రదర్శనలు ఇప్పించారు. కొన్ని నాటకాల్లోనూ నర్తించారు. ఆ పై మదరాసు చేరి జెమినీ స్టూడియోస్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా చేరారు. జెమినీ సంస్థ నిర్మించిన ‘చంద్రలేఖ’లో తొలిసారి తెరపై కనిపించారు. కొన్ని చిత్రాలలో నటించిన తరువాత ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన ‘సంసారం’ చిత్రంలో శేషమ్మ పాత్రలో సూర్యకాంతం నటన ఆకట్టుకుంది.

“పెళ్ళి చేసి చూడు, అమ్మలక్కలు, చక్రపాణి, ప్రేమ, దొంగరాముడు, కన్యాశుల్కం, చరణదాసి, ఇలవేల్పు, పెంకిపెళ్ళాం, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మంచి మనసుకు మంచిరోజులు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, కలసివుంటే కలదు సుఖం, గుండమ్మ కథ, రాముడు-భీముడు” వంటి చిత్రాలలో సూర్యకాంతం పలు విలక్షణమైన పాత్రల్లో అలరించారు. వాటిలో అధికభాగం గయ్యాళి పాత్రలే కావడం విశేషం.

ఈమె కాకినాడకు చెందిన వారు. తెలుగు వెండితెరపై గయ్యాళి అత్తయ్యగా పేరుపొందిన ఈ నటీమణి పేరున కాకినాడలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి MP వంగా గీత, MLA ద్వారంపూడి, మేయర్‌ శివప్రసన్న, విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ M వెంకటేశ్వర్లు హాజరవనున్నారు.2/2

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 16, 2021


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kakinada
  • Special Envelope!
  • Suryakantham

Related News

Loan App Harassment Kakinada

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు ఎంబీఏ విద్యార్థి బలి

MBA Student Suicide  లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చలేక యాప్ నిర్వాహకులు పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ క

  • Ap Police Recruitment

    APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

Latest News

  • మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd