Kadapa : అవినాష్ రెడ్డి దేశం దాటేందుకు సిద్దమయ్యాడు – వైస్ షర్మిల
గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని భారతి సలహా ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు
- Author : Sudheer
Date : 08-05-2024 - 2:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఓటమి భయంతో MP అవినాష్ రెడ్డి (Y. S. Avinash Reddy) దేశం దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS SHarmila) అన్నారు. ఇప్పటికే పాస్ పోర్ట్ లు సైతం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ‘ఓడిపోతే అరెస్ట్ తప్పదని అవినాష్ భయపడుతున్నారు ‘ అని షర్మిల చెప్పుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప లో బుధువారం షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి… వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ గొడలితో నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి ఇదే భారతీ రెడ్డి స్ట్రాటజీ అంటూ షర్మిల పేర్కొన్నారు. గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని భారతి (YS Bharathi) సలహా ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు.. ఇప్పటికే పాస్‌పోర్టులు రెడీ చేసుకున్నారని షర్మిల ఆరోపించారు. ఓడిపోయిన తర్వాత నడుస్తున్న కేసుల్లో అరెస్టు తప్పదని వాళ్లందరికి తెలుసు .. అందుకే ఆ అరెస్టు నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో ఉన్నారని విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటెయ్యండి. మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్‌రెడ్డికి ఓటెయ్యండి అంటూ షర్మిల ప్రజలను కోరింది.
అంతకు ముందు ప్రధాని మోడీకి షర్మిల రేడియో గిఫ్ట్‌గా పంపించి రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని , రాష్ట్ర ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.
Read Also : Komatireddy Venkatreddy : జూన్ 5న కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి