YS Sharmila : విద్యుత్ చార్జీల విషయంలో కూటమి పై షర్మిల ఫైర్
YS Sharmila : గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పాపాలు జరిగితే, కూటమి ప్రభుత్వం ప్రజలపై శాపం మోపుతోందని మండిపడ్డారు
- By Sudheer Published Date - 03:28 PM, Tue - 5 November 24

ఏపీ లో కరెంట్ చార్జీల పెంపు (Current Charges Hike) అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila) కూటమి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ చార్జీల పెంపు..ప్రజలపై భారం మోపడం అనైతికమని అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పాపాలు జరిగితే, కూటమి ప్రభుత్వం ప్రజలపై శాపం మోపుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.18 వేల కోట్ల సర్దుబాటు చార్జీల భారం ప్రజలపై మోపుతోందని విమర్శించారు.
విద్యుత్ చార్జీల పెంపు ఎన్నికల హామీలకు వ్యతిరేకమని, కూటమి ప్రభుత్వం అదనపు భారం తగ్గించడంలో విఫలమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందని అన్నారు… కూటమి అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచబోమన్నారు… అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే, అదనపు భారాన్ని ప్రజలపై మోపకూడదన్న చిత్తశుద్ధి లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని, కేంద్రం నుండి అదనపు నిధులు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు మద్దతుగా, అధిక విద్యుత్ బిల్లులపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Read Also : Nara Lokesh Red Book : కాస్కోండ్రా..అంటున్న నారా లోకేష్..వైసీపీ నేతలకు చుక్కలే..!!