AP Special Status : ఢిల్లీ జంతమంతర్ వద్ద వైస్ షర్మిల ధర్నా
- Author : Sudheer
Date : 02-02-2024 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
మరికాసేపట్లో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..ఢిల్లీ జంతమంతర్ (Delhi Jantar Mantar) వద్ద ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ధర్నా (Dharna ) చేపట్టబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్న ఈమె..వరుస గా పార్టీ నేతలతో సమావేశం అవుతూ..పదేళ్ల లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని , ముఖ్యంగా ఈ ఐదేళ్లలో రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని..జగన్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ధర్నాకు సిద్ధమైంది. పదేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీతో కుమ్మక్కై అన్ని పార్టీలు పక్కన పెట్టేశాయని ఆరోపిస్తూ వస్తున్న షర్మిల… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇస్తుంది. ఇక ప్రత్యేక హోదాను ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లేందుకు షర్మిల బహిరంగ సభల్లో చెప్పడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పిందని ఇది నమ్మక ద్రోహం అని నిరసన చేపట్టనున్నారు. దీనికి కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి సీనియర్ లీడర్లు రానున్నారు. ప్రస్తుతం న్యాయ్ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాలో పాల్గొంటారని సమాచారం.
Read Also : Mumbai Bomb Threat: 6 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు.. హైఅలర్ట్‌లో ముంబై..!