Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురు..
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసుల నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్ ను హైకోర్టులో కొట్టేసారు.
- Author : Kode Mohan Sai
Date : 18-11-2024 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తలంపులు ఎదురయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వర్మ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరుగుతోన్న తరుణంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయ స్థానం కొట్టి పారేసింది. అరెస్టు పై ఆందోళన ఉంటే, బెయిల్ పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టు ముందు అభ్యర్ధించారు. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇటువంటి అభ్యర్థనలు కోర్టు ముందు కన్నా పోలీసులతో చేయాలని న్యాయమూర్తి స్పష్టీకరించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు తన “ఊవ్యూహం” సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యొక్క వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై టిడిపి మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో, మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.