Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై ‘సుప్రీం’ సీరియస్!
COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
- By Balu J Published Date - 04:39 PM, Wed - 19 January 22

COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రధాన కార్యదర్శులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్‌గా హాజరు కావాలని, వారి రాష్ట్రాల్లో కోవిడ్-19 మరణానికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ఎందుకు పంపిణీ చేయలేదో వివరించాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు MR షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తుందని, కోవిడ్-19 కారణంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు రిజిస్ట్రేషన్, పంపిణీని సులభతరం చేయడానికి రాష్ట్ర న్యాయ సేవా అధికారులను (SLSA) కోరింది.
బీహార్ ఇచ్చిన COVID-19 మరణాల సంఖ్యను తిరస్కరిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇవి వాస్తవమైనవి కాదని, ప్రభుత్వ గణాంకాలు అని తెలిపింది. “కోవిడ్ కారణంగా బీహార్ రాష్ట్రంలో కేవలం 12,000 మంది మాత్రమే మరణించారని మేం నమ్మడం లేదు. మీ ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్‌గా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము” అని బీహార్ ప్రభుత్వం తరపు న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది. COVID-19 బాధితుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా సహాయం కోరుతూ న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్, న్యాయవాది సుమీర్ సోధి ప్రాతినిధ్యం వహించిన మధ్యవర్తులు చేసిన అభ్యర్థనలను కోర్టు విచారించింది. గత ఏడాది డిసెంబర్ 13న, కోవిడ్-19 మరణాలకు ఎక్స్ గ్రేషియా పరిహారం పంపిణీ కోసం అభివృద్ధి చేసిన పోర్టల్ గురించి విస్తృత ప్రచారం కల్పించనందుకు రాష్ట్రాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. విస్తృత ప్రచారం చేయకపోతే, ప్రజలు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునే పోర్టల్ చిరునామాను తెలుసుకోలేరని పేర్కొంది.
కొన్ని రాష్ట్రాలు వార్తాపత్రికలకు ప్రకటనలు, ముఖ్యంగా ప్రాంతీయ, స్థానిక చానెల్స్ లకు పూర్తి వివరాలను చేరవేయలేదని కోర్టు పేర్కొంది. కోవిడ్-19 బాధితుల బంధువులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పరిహారం పంపిణీలో పురోగతిపై రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించాలని కోర్టు గతంలో కేంద్రాన్ని కోరింది. దానికి విరుద్ధంగా స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. గత ఏడాది నవంబర్ 18న, కోవిడ్-19 కారణంగా మరణించిన వారి తదుపరి బంధువులకు ఎక్స్ గ్రేషియాకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలకు “కేవలం విరుద్ధంగా” నోటిఫికేషన్ జారీ చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను “ఓవర్‌రీచ్” చేయడానికి ప్రయత్నం జరిగింది.
మరణ ధృవీకరణ పత్రంలో వైరస్ కారణమని పేర్కొనలేదనే కారణంతో కేవలం కోవిడ్-19 కారణంగా మరణించిన వారి తదుపరి బంధువులకు రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా పరిహారాన్ని ఏ రాష్ట్రమూ నిరాకరించరాదని గత ఏడాది అక్టోబర్ 4న పేర్కొంది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తి మరణానికి సంబంధించిన రుజువుతో పాటు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా సంబంధిత జిల్లా యంత్రాంగానికి దరఖాస్తు చేసిన తేదీ నుండి 30 రోజులలోపు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోవిడ్-19 కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలనే దాని ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, నష్టపరిహారం ఇవ్వడానికి స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.