Samineni Udayabhanu : ఫ్యాన్ వదిలి గ్లాస్ పట్టుకోబోతున్న సామినేని ఉదయ భాను ..?
Samineni Udayabhanu : జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను సైతం పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 11:34 AM, Wed - 18 September 24

Samineni Udaya Bhanu Will Join In Janasena? : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట (Jaggaiyapet) నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను (Samineni Udayabhanu)..ఫ్యాన్ (YCP ) వదిలి గ్లాస్ (Janasena) పట్టుకునేందుకు సిద్ధం అయ్యాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలి గట్టిగా విచినప్పటికీ..ఈసారి మాత్రం కూటమి స్పీడ్ ముందు ఫ్యాన్ ఆగిపోయింది. ఎన్నికలకు ముందే ఫ్యాన్ పనిఅయిపోయిందని గ్రహించిన చాలామంది ఫ్యాన్ నేతలు కూటమి లోకి వచ్చి టికెట్స్ సాధించుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా పాలిస్తున్నారు.
కొంతమంది మాత్రం ఫలితాల అనంతరం వైసీపీ నుండి బయటకు రావడం మొదలుపెట్టారు. ఇప్పటికే కీలక నేతలంతా వైసీపీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను సైతం పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈనెల 24 లేదా 27న జనసేనలో చేరనున్నట్లు సమాచారం.
కాగా, జనసేనలో చేరికపై ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. వారి నుంచి లైన్ క్లియర్ కావడంతో బ్యానర్లు, పార్టీ జెండా దిమ్మె పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి టాటా చెప్పేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. సినీ నటుడు అలీ కూడా తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని ప్రకటించారు. మద్దాలి గిరి, కిలారు రోశయ్య, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి కీలక నేతలు పార్టీని వీడారు. వీరే కాదు ఇంకాచాలమందే వైసీపీ ని వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు వినికిడి.
Read Also : Sakunthala Passes Away : నటి CID శకుంతల కన్నుమూత