Sakunthala Passes Away : నటి CID శకుంతల కన్నుమూత
Sakunthala Passes Away : తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు
- By Sudheer Published Date - 11:18 AM, Wed - 18 September 24

Veteran Actress A Sakunthala passes away : దక్షిణాది నటి CID శకుంతల (Veteran Actress A Sakunthala )(84) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా ఛాతి నొప్పితో బాధపడుతున్న ఈమె నిన్న బెంగుళూర్ లో తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. MGR, శివాజీ వంటి లెజెండరీ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె కనిపించారు.
ఐటెం సాంగ్స్ కు పెట్టింది పేరు
ఐటమ్ నెంబర్ డ్యాన్సర్ గా, ప్రతినాయికగా ఈమె పలు పాత్రలు పోషించింది. ఆమె నటించిన మొదటి చిత్రం సి.ఐ.డి.శంకర్. ఆ తరువాత ఆమె “సి.ఐ.డి. శకుంతల” గా స్థిరపడింది. ఆ తర్వాత శకుంతల మరింత పాపులర్ అయింది. ‘తవపుతల్వన్’ సినిమాలో శివాజీ గణేశన్ పై ప్రతీకారం తీర్చుకునే క్రూరమైన ప్రతినాయక పాత్రను పోషించి ఆమె అభిమానుల ప్రశంసలు అందుకుంది. శకుంతల (Actress A Sakunthala ) స్వస్థలం సేలంలోని అరిసిపాళయం. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పాత తమిళ చిత్రం శకుంతలై పేరు పెట్టారు. ఆమె తండ్రి అరుణాచలం తిరువెరుంబూరులో ఉద్యోగం చేసేవాడు. చెన్నైలో లలిత – పద్మిని – రాగిణి హోస్ట్ చేసిన షోలో డాన్స్ నేర్చుకుంది. ఆ తర్వాత క్రమంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె “సూర్యన్ మెర్కేయం ఉతిక్కుమ్” అనే నాటకంలో నటించింది. సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేయడం, వాంప్ గా నటించడం, విలన్ గా నటించడం, అలాగే, ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. చిన్న చిన్న పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.
శకుంతల నటించిన సూపర్ హిట్ చిత్రాలు
శివాజీ పాడిక్కడ మేతై, కై కొడుత్త ధేవమ్, తిరుదన్, తవపుధలవన్, వసంత మాలిగై, నీతి, భారత విలాస్, రాజరాజ చోళన్, పొన్నుంజల్, ఎంగల్ తంగ రాజా, తాయ్, అన్బాయి తెడి, వైరా నెంజమ్, గృహప్రవేశం, రోజవిన్ రాజా, అవన్ ఒరు సరితిరామ్, అండమాన్ కాదలి, జస్టిస్ గోపీనాథ్, నాన్ వజవైప్పెన్, కీజ్ వానం శివక్కుంలలో ఆమె పాత్ర గురించి విస్తృతంగా చర్చించబడింది. ధరిసానం, ఎన్ అన్నన్, కళ్యాణ ఊరువలం, ఇదయా వీణై, కట్టిల తొట్టిల, తెడి వంథా లక్ష్మి, తిరుమలై తెంకుమారి, కరున్తేల్ కన్నయిరామ్, అతిర్ష్టకరన్, రోషక్కారి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఈమె నటించింది. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె నటించారు. ఇక ఈమె మృతి పట్ల సినీ ప్రముఖులు , అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also : Blindsight Device : అంధులకు చూపును ప్రసాదించే పరికరం.. ప్రయోగానికి న్యూరాలింక్ రెడీ