Chandrababu : చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు – సజ్జల
ఎంత సేపూ వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పి కోర్టులను కూడా మభ్యపెడుతున్నారని
- By Sudheer Published Date - 07:05 PM, Mon - 20 November 23

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఫై బయటకు రాగా..ఈరోజు హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఈనెల 29 నుంచి బెయిల్ (Bail)కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే.. బెయిల్ రెగ్యులర్ విషయమై 39 పేజీల తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లిఖార్జునరావు వెల్లడించారు. బాబుకు బెయిల్ రావడం తో టీడీపీ (TDP) శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని’ బాబుకు బెయిల్ రావడం ఫై నారా లోకేష్ (Nara Lokesh) అభివర్మించారు. “సత్యమేవజయతే” అన్నది మరోసారి నిరూపితమైందన్నారు. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని… జగన్ కనుసన్నల్లో వ్యవస్థల మేనేజ్‌మెంట్‌పై సత్యం గెలిచిందని లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తల ఎత్తుకుని నిలబడిందన్నారు. “నేను తప్పు చేయను, తప్పు చేయనివ్వను” అని తరచూ చంద్రబాబు చెప్పే మాటే మరోసారి నిరూపితమైందని లోకేష్ పేర్కొన్నారు.
టీడీపీ శ్రేణుల వర్షన్ ఇలా ఉంటె..వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Case) విషయం పరంగా తమకు ఎలాంటి సంబంధం లేదని వారు నిరూపించుకోవడం లేదని అన్నారు. ఎంత సేపూ వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పి కోర్టులను కూడా మభ్యపెడుతున్నారని సజ్జల (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. తాను మాజీ సీఎం అని, వయసు పైబడిందని చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. జైలులో దోమలు ఉన్నాయని, ఆరోగ్యం బాగోలేదని, గుండె సమస్యలు ఉన్నాయని, చర్మ సమస్యలు వచ్చాయని, 70 ఏళ్ల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారనే ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని సజ్జల అన్నారు.
Read Also : Vizag Fishing Harbour : మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటించిన జగన్..
Related News

YCP MP : ప్రజా ధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు : వైసీపీ ఎంపీ భరత్
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దోచుకోవడం వాస్తవమని