HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sajjala About Sharmila Joins Congress

YS Sharmila : షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక నిజంగా బాబు హస్తం ఉందా..?

  • Author : Sudheer Date : 06-01-2024 - 9:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

వైస్ షర్మిల రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకరావాలని వైస్ షర్మిల ఎన్నో కలలు కంటూ…రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ 2021 జులై 8న వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ స్థాపించగానే కేసీఆర్ ఫై పోరాటం మొదలుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ కేసీఆర్ ఫై విమర్శలు కురిపిస్తూ.. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలఫై పోరాటం చేస్తూ వచ్చింది. ధర్నాలు, నిరాహార దీక్షలు ఇలా ఎన్నో చేసి..వార్తల్లో నిలిచింది. కానీ ఇతర పార్టీల నేతలను ఆకట్టుకోలేకపోయింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో షర్మిలను పట్టించుకునే నాధుడు లేకుండాపోయాడు. అయినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని.. తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించింది. అయితే ఎన్నికలకు ముందు అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుటుంటుందని ప్రకటించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన షర్మిల..చివరకు తన పార్టీ ని కాంగ్రెస్ లో కలుపుతూ..ఆమెకూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంది. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందంటూ వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కచ్చితంగా ఉన్నారని అందుకు తమ దగ్గర చాలా ఆధారాలున్నాయన్నారు. సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలోనే షర్మిల, బ్రదర్‌ అనిల్‌ ఢిల్లీకి వెళ్లారని.. ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత బీటెక్ రవిని బ్రదర్ అనిల్‌ కలవడం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. అంతకు ముందు బెంగళూరులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చంద్రబాబు చర్చలు జరపడం..ఇవన్నీ చూస్తుంటే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం చంద్రబాబు ఆలోచనే అని సజ్జల గట్టిగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు అర్థం అయిందని.. అందుకే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను డైవర్ట్‌ చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చని.. ఆమె వల్ల వైసీపీ పార్టీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు.

మరి సజ్జల చేసిన ఆరోపణల్లో నిజం ఉందా..? షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక బాబు హస్తం ఉందా..? అనేది క్లారిటీ లేదు. ఏదొక ప్రతిపక్షం ఫై ఆరోపణ చేయాలి కాబట్టి..అందులోని ఎన్నికల ముందు ఎక్కువగా ఆరోపణలు చేస్తేనే ఆ పార్టీ ఫై ప్రజల్లో నమ్మకం పోతుందని సజ్జల ఇలా చేసి ఉంటారని టీడీపీ శ్రేణులు అంటున్నారు.

Read Also : YS Sharmila meet CM Revanth : సీఎం రేవంత్ కలిసిన షర్మిల..నెక్స్ట్ చంద్రబాబేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Sajjala
  • sharmila joins congress

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd