Pawan : వైసీపీ నేతలు పవన్ ను ఆలా అంటుంటే మీకు బాధేయదా..? తేజు చెప్పిన సమాధానం ఇదే..
పవన్ ను వైసీపీ నేతలు ఆలా విమర్శలు చేస్తుంటే..మీకు బాధేయదా.
- By Sudheer Published Date - 07:58 PM, Fri - 28 July 23

సినిమా వేరు..రాజకీయాలు వేరు. సినిమాల్లో హీరో అని కొలిచినవారే..రాజకీయాల్లోకి వచ్చేసరికి బండబూతులు తిడుతుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అలాంటి విమర్శలే ఎదురుకుంటున్నారు. సినిమాల్లో వేల కోట్లు సంపాదించుకునే సత్తా ఉన్న పవన్..అవన్నీ వదిలేసి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆలా రాజకీయాల్లోకి (AP Politics) వచ్చిన దగ్గరి నుండి అనేక మంది ఆయన్ను రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ (YCP) నేతలైతే పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల (Pawan Kalyan Three Marriages) ఫై దారుణంగా మాట్లాడుతున్నారు. ఇటీవల సీఎం జగన్ (CM JAGAN) కూడా పదే పదే పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజ్ స్టార్ అని.. దత్తపుత్రుడు అని.. మూడు పెళ్లిళ్లు అని పబ్లిక్ సభల్లో అంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కాదు రాజకీయంగా ఎదుర్కొండని జనసేన శ్రేణులు అంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. కానీ ఓపికతో ఉంటున్నారు. మాటకు మాటకు సమాధానం చెప్పడం కాదు ఓటు ద్వారా సమాధానం చెప్పాలని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ను విమర్శలు చేయడం..అనరాని మాటలు అంటుంటే మీకు బాధ వేయదా అని తాజాగా బ్రో (BRO) మూవీ ప్రమోషన్ కార్య క్రమాల్లో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ను ప్రశ్నించారు. దీనికి ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల గురించి మాట్లాడేటంత అర్హత నాకు లేదు. కానీ మా మామయ్యని అంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది. కాకపోతే కళ్యాణ్ బాబాయ్ గురించి ఒక్కటి చెప్పాలి. నన్ను, వరుణ్‌ని.. చరణ్‌ని.. వైష్ణవ్‌ని పిలిచి.. నేను పాలిటిక్స్‌లోకి వెళ్తున్నాను.. నేను పాలిటిక్స్‌లో ఉండటం వల్ల నాపై చాలా విమర్శలు వినిపిస్తాయి. చాలా నీఛంగా మాట్లాడతారు.. వాటికి మీరు రియాక్ట్ కావొద్దు. మిడిమిడి జ్ఞానంతో మీరు మాట్లాడొద్దు.. మీరు పట్టించుకోవద్దు. ఈ విషయంలో నన్ను మన్నించండి’ అని అన్నారు.
మిమ్మల్ని మన్నించడం ఏంటి మామయ్యా.. అది మా వల్ల కాదని అన్నాం. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు. ‘రేయ్.. నన్ను ఎవరైనా ఏమైనా అంటే మీరంతా రియాక్ట్ అవుతారని నాకు తెలుసు. అందుకే చెప్తున్నా.. మీరు జాగ్రత్తగా ఉండండి. నా కోసం ఆందోళన చెందాల్సిన పనిలేదు.. నన్ను నేను కాపాడుకోగలను. నేను చూసుకుంటా.. మీ సపోర్ట్ అయితే నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని నాకు తెలుసు.. అది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. ఆయన చెప్పిన మాటలు మేం ఎప్పటికీ మర్చిపోలేం.. అందుకే ఆయన్ని ఎవరు ఏమన్నా మేం పట్టించుకోవడం లేదు’ అని తేజు క్లారిటీ ఇచ్చారు.
Read Also: BRO లో అంబటి రాంబాబు..ఇది కనిపెట్టారా..?