Jagan : రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది – జగన్
Jagan : ప్రతి బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి ఇలాంటి తప్పులు మళ్లీ జరగవని హామీ ఇవ్వాలి. వైసీపీ తరఫున ప్రతి బాధిత కుటుంబానికి రూ. 10లక్షలు ఇస్తాం. ఇది చూసైనా చంద్రబబు సిగ్గు తెచ్చుకోవాలి
- By Sudheer Published Date - 12:42 PM, Wed - 23 October 24

ఆంధ్రప్రదేశ్ (AP) లో మహిళల భద్రతను (Women’s Safety) కూటమి ప్రభుత్వం (NDA Govt) ప్రశ్నార్థకంగా మార్చిందని జగన్ (Jagan) దుయ్యబట్టారు. ‘ఇటీవల జరిగిన అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ప్రతి బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి ఇలాంటి తప్పులు మళ్లీ జరగవని హామీ ఇవ్వాలి. వైసీపీ తరఫున ప్రతి బాధిత కుటుంబానికి రూ. 10లక్షలు ఇస్తాం. ఇది చూసైనా చంద్రబబు సిగ్గు తెచ్చుకోవాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇంకేం చేస్తుందో చేయాలి’ అని డిమాండ్ చేశారు.
ఇటీవల బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్ విద్యార్థిని బలైన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు జగన్ బద్వేల్ కు వెళ్లారు. జగన్ పరామర్శ నేపథ్యంలో సీఎం చంద్రబాబు దిగొచ్చారని వైసీపీ అంటుంది. ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని చంద్రబాబులో ఎట్టకేలకు స్పందించారని , జగన్ పరామర్శకు వెళ్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేసారని వారంతా పేర్కొంటున్నారు. బాధితురాలి తల్లితో చంద్రబాబు మాట్లాడి , బాధిత కుటుంబానికి అండగా ఉండడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని బాబు హామీ ఇచ్చారని వైసీపీ అంటుంది. ఇదంతా జగన్ వల్లే జరిగిందని , జగన్ పరామర్శ అనగానే బాబు లో భయం పుట్టుకొచ్చి వెంటనే బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారని వారంతా వాపోతున్నారు.
Read Also : Reliance Jio Offers: దీపావళికి జియో బహుమతి.. కేవలం 101 రూపాయలకే అపరిమిత 5G డేటా!