AP Govt : వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP Govt : రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమైంది
- By Sudheer Published Date - 10:13 AM, Thu - 31 October 24

ఏపీ సర్కార్ (AP Govt) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదాని ఒకటి నెరవేరుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చిన సర్కార్..తాజాగా వేద పండితులకు (Vedic Scholars) ఇచ్చిన హామీని నెరవేర్చింది. రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ. 3,000 (allowance ) నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద సుమారు 600 మందికి ఈ ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వేద పండితులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3,000 అందించనున్నారు. ఈ మొత్తాన్ని సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల ద్వారా చెల్లిస్తారు. ఈ సాయం పొందే పండితులు తమ నివాస ప్రాంతానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలనీ ప్రభుత్వం పేర్కొంది. కార్యక్రమం ద్వారా, వేద పండితుల జీవితోపాధికి సహాయముగా ఉండటమే కాకుండా, వేద మంత్రాల పారాయణం కొనసాగింపునకు కూడా మద్దతు లభిస్తుంది.
Read Also : Seediri Appalaraju : హాస్పటల్ లో చేరిన మాజీ మంత్రి అప్పలరాజు