HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rs 1500cr Land Scam In Vizag Alledges Tdp Leader

Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ‌ ‘భూంఫ‌ట్‌’

విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బ‌య‌ట పెట్టింది. ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌లు ఆ భూముల‌ను మింగేశార‌ని ఆరోప‌ణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను ఆ పార్టీ నేత‌లు చూపుతున్నారు.

  • Author : CS Rao Date : 05-04-2022 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Velagapudi Vijaysaireddy
Velagapudi Vijaysaireddy

విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బ‌య‌ట పెట్టింది. ప్ర‌భుత్వంలోని కొంద‌రు పెద్ద‌లు ఆ భూముల‌ను మింగేశార‌ని ఆరోప‌ణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను ఆ పార్టీ నేత‌లు చూపుతున్నారు. క్విడ్ ప్రో కో కింద 1500 కోట్ల విలువ చేసే భూముల‌ను కేవ‌లం 187 కోట్ల‌కు ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌కు క‌ట్ట‌బెట్టార‌ని వెలికితీసింది. ఆ పార్టీ నేత‌లు చెబుతున్న దాని ప్ర‌కారం…
విశాఖ జిల్లా రిషికొండ ఐటి సెజ్ స్థలంలో బినామీ పేర్లతో కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వ పెద్దలు అన్యాక్రాంతం చేశారు. ఎన్సీసీ (NCC) కి చెందిన రూ. 1500 కోట్ల భూ పందేరంలో కీలక సూత్రధారులున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పల్లా శ్రీనివాస్ లు చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ఇప్పటికే సింగపూర్ కంపెనీతో ఎన్సీసీ సుమారు రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టించింది. అయితే విశాఖ కేంద్రంగా ఉన్న కీలక వైసీపీ నేత ఈ వ్యవహారంలో చక్రం తిప్ప‌డంతో బెంగుళూరుకు చెందిన జీఆర్‌పీఎల్ (Grpl) హోసింగ్ కంపెనీ తెరపైకి వచ్చింది. సింగపూర్ కంపెనీని కాదని జీఆర్‌పీఎల్‌తో ఎన్సీసీ ఒప్పందం కుదుర్చుకుందంటూ వివాదం చెలరేగింది.97 ఎకరాలను కేవలం రూ. 187 కోట్లకు హౌసింగ్ బోర్డ్ నుంచి ఎన్సీసీ తీసుకుందని మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుంది. ఆ మేర‌కు టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. విశాఖ‌ను YSRCP MP విజయసాయిరెడ్డి నుంచి రక్షించాలంటూ వాళ్లు కోరుతున్నారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు మళ్ళీ క్విడ్ ప్రో మొదలెట్టారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రిషికొండ వద్ద టీడీపీ నేతలు భారీ ధర్నా చేయ‌డం ద్వారా అక్క‌డ జ‌రిగిన అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని ప్ర‌య‌త్నించారు.

రూ.1500 కోట్ల స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రూ.1500 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. Ncc కి తక్కువ రేటు ఇవ్వడానికి కారణమేంటి, Grpl కంపెనీ ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఓపెన్ ఆక్షన్ పెట్టాలని తద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. విశాఖ నుంచి లూలు, టెంపుల్తన్ పంపేశారని, ఇపుడు సింగపూర్ కంపెనీని కూడా పంపేస్తున్నారని తెలిపారు. ఐటి సెజ్ భూ కేటాయింపులు రద్దు చేసేంతవరకూ టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చ‌రించారు. ఏదేమైనా విశాఖలో వరుసగా బయటకికొస్తున్న భూ వివాదాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి అసలు నిజాలు బయటకు పెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • land scam
  • vijay sai reddy
  • vizag

Related News

Rowdy Sheeter Rapes A Minor

మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd