Simhachalam Temple : దేవున్నే బురిడీ కొట్టించిన భక్తుడు
ఇటీవల కాలంలో మనుషుల్లో అతి తెలివి ఎక్కువైంది. ఎంతలా అంటే దేవుడి సైతం మోసం చేయాలనేంతగా.. తాజాగా సింహాచలం అప్పన్న స్వామి ఆలయం (Simhachalam Temple)లో అదే జరిగింది.
- By Sudheer Published Date - 11:48 AM, Thu - 24 August 23

Simhachalam Temple : అదేంటి దేవుళ్లను కూడా బురిడీ కొట్టిస్తారా..? అని మీరు అనుకోవచ్చు. కానీ బురిడీ చేయాలనీ అనుకున్న వారు సామాన్య మనిషితేనే.. మనలోకాన్ని సృష్టించిన దేవుడైతేనేం.. అంత ఒక్కటే. కళ్లముందు కనిపించే వారినే వారి మాటలతో , చేష్టలతో బురిడీ కొట్టిస్తున్నారు..అలాంటిది కనిపించని దేవుని కొట్టారా..? చెప్పండి. ఇటీవల కాలంలో మనుషుల్లో అతి తెలివి ఎక్కువైంది. ఎంతలా అంటే దేవుడి సైతం మోసం చేయాలనేంతగా.. తాజాగా సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Temple) ఆలయంలో అదే జరిగింది.
మాములుగా ఎవరైనా గుడికి వెళ్తే.. దేవుని మొక్కుకొని హుండీలో కానుకలు , డబ్బులు సమర్పించి తమ కోర్కెలు తీర్చాలని భగవంతుడ్ని కోరుకుంటారు. అయితే ఇక్కడ ఓ భక్తుడు హుండీ లో ఏకంగా రూ. 100 కోట్ల చెక్ వేసి..ఆలయ సిబ్బందిని సంబరాలకు గురి చేసాడు. రూ. 100 కోట్ల చెక్ చూసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ తీరా ఆ చెక్ తీసుకొని బ్యాంకు కు వెళ్తే కానీ అసలు నిజం తెలియలేదు. ఆ అకౌంట్ 100 కోట్లు కాదు..కనీసం 100 రూపాయిలు కూడా లేవని.
రీసెంట్ గా సింహాచలం కొండపై కొలువై ఉన్న సింహాచలం అప్పన్నస్వామి హుండీ (Simhachalam Temple Hundi) లెక్కింపు జరిగింది. హుడీ లెక్కిస్తున్న సిబ్బందికి ఓ చెక్ కంటపడింది. ఆ చెక్ చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి దాదాపు 100 కోట్ల రూపాయలకు ఆ చెక్కును (Rs.100 Crore Cheque) రాసి హుండీలో వేసాడు. ఆలయ చరిత్రలో అదే పెద్ద మొత్తం కావటంతో వారు ఎంతో సంతోషించారు. దాన్ని ఈవో దగ్గరకు తీసుకెళ్లగా ఆయన కూడా సంతోష పడి, ఆ చెక్కు చెల్లుతుందా? లేదా? అన్న అనుమానం వచ్చి ఆ చెక్‌ను బ్యాంకుకు పంపి ఆరా తీశారు. ఆ చెక్ చూసిన బ్యాంకు అధికారులు..సదరు వ్యక్తి అకౌంట్ చెక్ చేయగా..అతడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నాయి. దీంతో ఆలయ అధికారులు షాక్ తిన్నారు. రాధాకృష్ణ అడ్రస్ అడుగుతూ బ్యాంకుకు లేఖ రాశారు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్ వేసి ఉంటే.. చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద దేవుడ్ని కూడా బురిడీ కొట్టించాడని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Chandrayaan-3 Landing: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. ఈ మిషన్‌లో పాల్గొన్న కంపెనీల షేర్లపై ప్రభావం..!