HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Roja Defends Jagan Fake Video Case Political Conspiracy Alleged

RK Roja : కక్ష్య సాధించడంలో భాగామే ఈ కేసు‌..

జగన్‌పై నమోదైన కేసును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం, ఫేక్ వీడియోలతో జగన్ పేరును మంటగలిపేందుకు పునరావృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

  • Author : Kavya Krishna Date : 23-06-2025 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Roja
Roja

RK Roja : జగన్‌పై నమోదైన కేసును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం, ఫేక్ వీడియోలతో జగన్ పేరును మంటగలిపేందుకు పునరావృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ కుట్రల వెనుక నందమూరి కుటుంబం నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు.

“జగన్‌పై ప్రజల్లో ఉన్న ఆదరణను తట్టుకోలేకే కుట్రలు, అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. ఆయనపై ఒక ఫేక్ వీడియోను వదిలి భయపెట్టాలని చూస్తున్నారు. ఎస్పీ కూడా తొలుత వాహనం వల్ల కాదు అన్నారని, తర్వాత అదే అధికారులే వీడియో తీసి బయటపెట్టారు. ఇది పక్కా ప్లాన్. వీడియోను టెస్ట్ చేయాలంటే ఎక్కడికైనా పంపండి,” అంటూ రోజా స్పష్టం చేశారు.

“ఇంటెలిజెన్స్ శాఖ నాలుగు రోజులుగా నిద్రపోతుందా?” అంటూ ప్రశ్నించిన ఆమె, అసలు పోలీసుల దగ్గర లేని వీడియో బయటకు ఎలా వచ్చిందో అన్వేషించాలని డిమాండ్ చేశారు. ఈ ఫేక్ వీడియో వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

“జగన్ గుండెలేని నాయకుడు కాదు. ఒక వృద్ధుడు కింద పడి ఉన్నా చూసుకోకుండా వెళ్లే వ్యక్తి కాదు” అంటూ జగన్‌ పరిపాలన తీరును సమర్థించడమే కాకుండా, గతంలో చోటుచేసుకున్న పలు సంఘటనలతో ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలను పోల్చారు.

“తిరుపతి, సింహాచలం, గోదావరి పుష్కరాల్లో జరిగిన మరణాలపై చంద్రబాబు, పవన్‌పై కేసులు పెట్టాలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక “గేమ్ ఛేంజర్” ఫంక్షన్‌లో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్‌పై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

పి4 పథకం కింద ప్రభుత్వ ప్రధానులు, వారి భార్యలు మొదట తమ ఆస్తులను ప్రజలతో పంచుకోవాలని, అప్పుడు ప్రజల్లో నమ్మకం కలుగుతుందని రోజా అన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో కొత్త ప్రభుత్వం మోసం చేసిందని, ఉద్యోగ హామీలను తూటాగా విసిరినా నెరవేర్చలేదని ఆమె విమర్శించారు.

Pete Hegseth: ఇరాన్ తో యుద్ధం చేయం.. అవే మా టార్గెట్.. అమెరికా క్లారిటీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • Fake Video Controversy
  • Jagan Convoy Case
  • Kukatpally Incident
  • Pawan Kalyan
  • Political conspiracy
  • RK Roja
  • RK Roja Comments
  • Roja Slams TDP
  • Telangana Andhra News
  • Tirupati Politics
  • YS Jagan Case
  • YSRCP News

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

  • Ustaad Bhagat Singh

    ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్‌!

Latest News

  • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

  • ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

  • గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

  • ఉద్యోగులకు రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు గిఫ్ట్‌..

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd