AP : కూటమికి ఓటమి భయం పట్టుకుంది – రోజా
జగన్ ను ఓడించేందుకు ఎన్ని పొత్తులు పెట్టుకున్న గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసారు రోజా
- Author : Sudheer
Date : 23-03-2024 - 3:58 IST
Published By : Hashtagu Telugu Desk
కూటమికి అప్పుడే ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు మంత్రి రోజా (Minister Roja). జగన్ ను ఓడించేందుకు ఎన్ని పొత్తులు పెట్టుకున్న గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసారు రోజా. టీడీపీ, జనసేన (TDP-Janasena) అభ్యర్థుల జాబితాను పేలవంగా విడుదల చేశారని..ఆ జాబితాను చూసి వైసీపీ వాళ్లు సంబరాలు చేసుకున్నారని రోజా తెలిపారు. 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రజలు మోసం చేసిందని ..అప్పట్లో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శలు కురిపించారు.
We’re now on WhatsApp. Click to Join.
తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని, చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని ఈ సందర్బంగా రోజా ఎద్దేవా చేసారు. ప్రధాని మోడీ నిర్వహించిన ప్రజాగళం సభ తర్వాత ఆ కూటమి ఓటమని ఖరారైందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఎళ్లుగా పనిచేసిన వారికి టీడీపీ సీటు ఇవ్వలేదని ఆరోపించారు. మొదట 24 సీట్లు దక్కినందుకు గాయత్రీ మంత్రం అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారని, ఇప్పుడు 21 సీట్లకు ఎమి చెప్పాలో ఆయనకు త్రివిక్రమ్ రాసివ్వలేదేమో అంటూ ఎద్దేవా చేశారు. జనసేన ప్రకటించబోతున్న 21 సీట్లలో పదిమంది టీడీపీ నేతలే ఉంటారని అన్నారు. ప్రజలంతా 175 స్థానాల్లో వైసీపీని గెలిపిస్తారని రోజా ధీమా వ్యక్తం చేశారు.
Read Also : Gold- Silver Price: చాలా రోజుల తర్వాత బంగారం ధర తగ్గుదల.. ఎంతంటే..?