Nagari : మూడు రోజుల్లో పోలింగ్..అయినాగానీ రోజా తీరు మారలేదు..
నగరి అభ్యర్థి అయ్యి ఉండి..పార్టీ నేతలంతా వస్తే ఆమె వెళ్ళకపోవడం ఫై అధిష్టానం సైతం సీరియస్ గా ఉందట
- Author : Sudheer
Date : 09-05-2024 - 5:56 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ (AP)లో మరో మూడు రోజుల్లో పోలింగ్ (Poling) జరగబోతుంది..ఈసారి ఏ పార్టీ గెలుస్తుందా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మూడు పార్టీలు కలిసిన కూటమి విజయ జెండా ఎగురవేస్తుందా..? లేక మరోసారి వైసీపీ విజయకేతనం ఎగురవేస్తారు ..? అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. గత నెల రోజులుగా అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించడం కోసం అధినేతలు ,మంత్రులు , ముఖ్య నేతలు ఇలా అంత కష్టపడుతున్నారు. అయితే నగరి (Nagari) కి వచ్చేసరికి అంత రివర్స్ గా ఉంది. నగరి లో వైసీపీ తరుపున రోజా (RK Roja) మూడోసారి బరిలోకి దిగుతుంది. ఇక్కడ రోజా కు గడ్డుకాలమే అని అంత చెపుతూ వస్తున్నారు. దీనికి కారణం కూడా రోజా తీరే. రెండోసారి గెలవడమే ఆలస్యం నియోజజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మానేసి తాను అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టిందని ఆ పార్టీ నేతలే చెపుతూ వచ్చారు. ఒకటి రెండు కాదు దాదాపు ఐదు మండలాలు రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి లేఖ కూడా రాసారు. అంతేనా మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) తో రోజా విభేదాలు కూడా పెట్టుకొని ఆయన దృష్టిలో కూడా చెడ్డ పేరు తెచ్చుకుంది. గత కొద్దీ నెలలుగా పెద్ది రెడ్డి vs రోజా క్లాష్ నడుస్తూనే ఉంది. ఒకరి సభలకు ఒకరు వెళ్లారు..ఒకరు వెళ్లిన కార్యక్రమానికి మరొకరు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు కూడా అలాగే రోజా వ్యవహరించడం ఎవ్వరికి నచ్చడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
పెనమలూరు మండలం వైసీపీ గౌరవాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడు, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి సోదరుడు పాలసముంద్రం నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చాలా మంది వైసీపీ నాయకులు నరసింహా రెడ్డి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. ఇక ఇప్పుడు వీలు చూసుకొని అంత వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కుమారుడు భూపేష్, చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇలా చాలామంది వైసీపీ నేతలు పెనుమూరు చేరుకుని నరసింహా రెడ్డి, జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను ఓదర్చారు. కానీ రోజా మాత్రం వెళ్లలేదు. నగరి అభ్యర్థి అయ్యి ఉండి..పార్టీ నేతలంతా వస్తే ఆమె వెళ్ళకపోవడం ఫై అధిష్టానం సైతం సీరియస్ గా ఉందట. పెద్దిరెడ్డి రావడం వల్లే ఆమె వెళ్లలేదని అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇలా పాత గొడవలు మనసులో పెట్టుకొని ఉంటారా..? అని అంత రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : AP Elections : వైఎస్సార్‌సీపీ కలలు బద్దలు కొట్టిన ఈసీ..!