HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rk Roja Strong Counter To Tdp Mla Daggubati Prasad Comments

Jr.NTR : ఎన్టీఆర్ సినిమాల్ని ఎవరూ ఆపలేరు – రోజా

Jr.NTR : ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ఆడియోలు తనవి కావని, తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

  • Author : Sudheer Date : 17-08-2025 - 4:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Roja Ntr Movies
Roja Ntr Movies

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి జూ. ఎన్టీఆర్ (Jr . NTR) పేరు హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (Duggupati Venkateswara Prasad) పై ఆరోపణలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా (Roja) దీనిపై స్పందించారు. రాజకీయాలను, సినిమాలను కలపవద్దని, ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఆయన సినిమాలను ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు. సినిమా బాగుంటే ప్రజలు చూస్తారని, ఎమ్మెల్యేలు ఎన్ని టికెట్లు కొన్నా పవన్ కళ్యాణ్ “HHVM” సినిమాను ఎవరూ చూడలేదని గుర్తు చేశారు. సినిమాలకు ఉన్న ప్రజాదరణను రాజకీయాలు ప్రభావితం చేయలేవని ఆమె అభిప్రాయపడ్డారు.

CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!

ఈ వివాదం అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలతో మొదలైంది. ఆయన జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కొన్ని ఆడియో రికార్డింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ఆడియోలు తనవి కావని, తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయినప్పటికీ తన పేరు ప్రస్తావనకు వచ్చినందుకు ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానినని ఆయన తెలిపారు. ఇక మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆడియో కాల్స్ ద్వారా ఆయన మాట్లాడినవిగా చెబుతున్న కొన్ని వివాదాస్పద విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులతో తలెత్తిన ఈ ఆడియో టేపుల వివాదం మరింత రచ్చకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jr ntr
  • NTR movies stop
  • RK Roja Strong Counter
  • tdp
  • TDP MLA Daggubati Prasad Comments

Related News

TDP candidate Bodepudi Revathi wins in Madhira

మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

TDP candidate Bodepudi Revathi wins in Madhira  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిట

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Latest News

  • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

  • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

  • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

  • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

  • జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

Trending News

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd