YSR 75th Birthday : ఎంతకాలమైనా వైఎస్‌ను మరచిపోలేము – రేవంత్‌రెడ్డి
వైస్ రాజశేఖర్ రెడ్డి ని తామంతా కుటుంబసభ్యుడిలా భావిస్తామని తెలిపారు. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్న రేవంత్‌రెడ్డి
- By Sudheer Published Date - 08:49 PM, Mon - 8 July 24

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75 వ జయంతి (YS Rajasekhara Reddy s 75th birthday) నేడు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి సి.కె.కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీసీసీ ఆధ్వర్యంలో YSR జయంతి సభ నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా వైఎస్ అభిమానులకు కొదవలేదని పేర్కొన్నారు. వైస్ రాజశేఖర్ రెడ్డి ని తామంతా కుటుంబసభ్యుడిలా భావిస్తామని తెలిపారు. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్న రేవంత్‌రెడ్డి, 2007లో వైఎస్ ముందు అనేక విషయాలు ప్రస్తావించానని గుర్తు చేసుకున్నారు. మండలిలో మాట్లాడినప్పుడు వైఎస్ తనను ప్రోత్సహించేవారన్నారు. కొత్త సభ్యుల మాటలు కూడా వినాలని వైఎస్ చెప్పేవారని, ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ ఉదారంగా ఉండేవారని కొనియాడారు. కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ ప్రయత్నించేవారన్నారు.
చేవెళ్ల-ఇచ్ఛాపురం పాదయాత్రతో 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్న రేవంత్, ఏ పదవీ రాకున్నా కూడా వైఎస్ పార్టీని వదల్లేదని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షమనేదే లేదని ,ఇక్కడ ఉన్నదంతా పాలకపక్షమే అని ఈ సందర్బంగా రేవంత్ చెప్పుకొచ్చారు. BJP అంటే బాబు, జగన్, పవన్. వీళ్లంతా మోదీ పక్షమే. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది షర్మిల ఒక్కరే. 1999లో వైఎస్ పోషించిన పాత్రను షర్మిల ఇప్పుడు పోషిస్తుందని ప్రశంసించారు. 2029లో షర్మిల ఏపీ సీఎం అవుతారని , కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, ఆమె పోరాటం వృథా కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also : Pawan Kalyan : మరియమ్మ కు ఆటో గిఫ్ట్ ఇచ్చిన పవన్