HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Reliances Huge Plant In Ap With A Few Hundred Crores

Reliance : ఏపీలో కొన్ని వందల కోట్లతో రిలయన్స్ భారీ ప్లాంట్

Reliance : కర్నూలు జిల్లాలో ఫుడ్ & బివరేజ్ రంగంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 19న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, సంస్థ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.

  • By Sudheer Published Date - 07:35 AM, Fri - 27 June 25
  • daily-hunt
Ap Reliance
Ap Reliance

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ఫుడ్ & బివరేజ్ రంగంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 19న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, సంస్థ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.

Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా దూరం? అతని స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?

ఈ పరిశ్రమకు రూ.1622 కోట్ల పెట్టుబడి లభించనున్నదిగా తెలిపిన రిలయన్స్ సంస్థ, ఓర్వకల్లు సమీపంలో 80 ఎకరాల భూమిపై పరిశ్రమను స్థాపించనుంది. APIIC ల్యాండ్ బ్యాంకులోని ఈ భూమిని ఎకరాకు రూ.30 లక్షల చొప్పున కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పన్ను మినహాయింపులు, విద్యుత్ రాయితీలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహాలు అందించనున్నారు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, ప్యాకెజ్డ్ వాటర్ తయారీకి ఈ యూనిట్ లో ఉత్పత్తులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, పరోక్షంగా పలువురు ఇతర రంగాల్లో ఉపాధి పొందనున్నారు.

ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి 2025 డిసెంబర్ కల్లా ఉత్పత్తిని ప్రారంభించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు & వాణిజ్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, APIIC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పారిశ్రామికంగా వెనుకబడిన రాయలసీమకు ఈ ప్రాజెక్టు ప్రగతికి తోడ్పడుతుందని, స్థానిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదలకూ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • chandrababu
  • reliance
  • Reliance's huge plant

Related News

Lokesh Google

Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్

Lokesh US Tour : రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడం మరియు ప్రవాసాంధ్రులతో (NRIలు) అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది

  • Chandrababu

    CBN : మెరుగైన పాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

  • New Districts In Ap

    New Districts in AP : ఏపీలో రెండు కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు!

  • Grama Panchayat Election In

    Grama Panchayat Election : ఏపీలో మళ్లీ ఎన్నికల జాతర

  • Venkatrao Gannavaram

    Gannavaram : గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ వెంకట్రావు

Latest News

  • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

  • Battery Tips: మీ ఈవీ బ్యాటరీ ఎక్కువ కాలం వ‌చ్చేలా చేసే టిప్స్ ఇవే!

  • Cheteshwar Pujara: క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య.. కార‌ణ‌మిదే?!

  • Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

  • Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd