AP Fake Jobs : సెక్రటేరియట్‌లో ఉద్యోగాలంటూ మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు
ఏపీ సచివాలయం లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది యువకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్ అసిస్టెంట్‌లు,
- By Prasad Published Date - 06:54 PM, Sun - 17 July 22

ఏపీ సచివాలయం లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది యువకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్ అసిస్టెంట్‌లు, జూనియర్ ఇంజనీర్లుగా కొలువులు కట్టబెడతామని.. ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయల వరకు వసూళ్లు చేశారు.
నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బు వెనక్కి ఇమ్మంటే… ముఠా సభ్యులు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో విజయవాడలో ఇద్దరు ముఠా సభ్యులను బాధితులు పట్టుకున్నారు. ఈ ముఠాకు సూత్రధారి విద్యాసాగర్.. అలియాస్ నాని.. సచివాలయంలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే దారి అంటూ బాధితులు వాపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు