Rayalaseema : రాయలసీమకు కరవు బాధ తప్పింది
Rayalaseema Drought : రాయలసీమకు కరవు బాధ తప్పింది
- By Sudheer Published Date - 10:21 AM, Sun - 3 November 24

కరువు (Rayalaseema Drought) ప్రాంతమైన రాయలసీమ(Rayalaseema )కు ఇక ఆ బాధ తప్పింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు (Rains) పడడంతో రాయలసీమలో కరువు అనే మాట వినిపించదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ అనే ప్రాంతం ఎప్పటి నుంచో కరువు, నీటి కొరత సమస్యలతో పోరాటం చేస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. వర్షపాతం తక్కువగా ఉండటం, నేల తక్కువ ఉత్పాదకత కలిగి ఉండటం వంటి కారణాలు కరువు పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
రాయలసీమ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడుతుంటారు. అయితే అక్కడి వర్షాధారపు వ్యవసాయంపై కరువు తీవ్రమైన ప్రభావం చుపిస్తుటుంది. ఇక్కడ సాగు నీటి అందుబాటు లేకపోవడం, ప్రాజెక్టుల తక్కువ సామర్థ్యం, సాగునీటి అనుసంధాన వ్యవస్థల అభావం వంటి సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ప్రభుత్వం రాయలసీమ కరువు సమస్యను పరిష్కరించడానికి పలు ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పటికీ, వాటి అమలు మరింత సమర్థవంతంగా జరుగకపోవడం వల్ల ఇంకా పూర్తిస్థాయిలో సమస్యను అధిగమించలేకపోతున్నారు. కృష్ణా, పెన్నా నదుల పై వరద నీటిని రాయలసీమకు మళ్లించడం, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను వేగవంతంగా పూర్తి చేయడం వంటి చర్యలు మిగిలిన నీటి సమస్యలను కొంతవరకు పరిష్కరించగలవు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయదారులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, నీటి వనరులను అభివృద్ధి చేసి, దీర్ఘకాలికంగా కరువు ప్రభావాన్ని తగ్గించేలా చురుకైన చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో రాయలసీమకు కరవు బాధ తప్పింది. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 211 టీఎంసీల నీటిని తరలించారు. 2022లో గరిష్ఠంగా 183 టీఎంసీల నీటిని తరలించగా ఇప్పుడు దాని కంటే దాదాపు 30 టీఎంసీల జలాలను అధికంగా వాడుకున్నారు. తెలుగు గంగ, గాలేరు-నగరి, SRBC ద్వారా రాయలసీమలోని పలు రిజర్వాయర్లలో కృష్ణమ్మ నీటిని నింపారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి కరువు బాధ అనేది తప్పినట్లు అయ్యింది.
Read Also : Caste Enumeration : కులగణనపై హై కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్..?