Rajya Sabha Offer : మెగా బ్రదర్ కు రాజ్యసభ సీటు ఖరారు..?
Nagababu : ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దాని పైన కూటమి సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది
- Author : Sudheer
Date : 28-09-2024 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కు రాజ్యసభ సీటు (Rajyasabha Ticket) ఖరారయ్యిందా..? అంటే అవుననే అంటున్నాయి కూటమి వర్గాలు. తాజాగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ముగ్గురు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దాని పైన కూటమి సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన..రెండు టీడీపీకి ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది.
టీడీపీ ఎంపీలలో ఒకటి గల్లా జయదేవ్ కి కేటాయిస్తుండగా.. మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇవ్వనున్నారని అంటున్నారు. మరోటి జనసేన నుండి నాగబాబు కు ఇవ్వాలని కూటమి ఫిక్స్ అయ్యారట. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాగబాబును తొలుత అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కటంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకున్నారు. నాటి ఒప్పందంలో భాగంగా నాగబాబుకు ఇప్పుడు రాజ్యసభ ఖాయంగా కనిపిస్తోంది. నిజముగా నాగబాబు కు రాజ్యసభ సీటు ఇస్తే మెగా అభిమానుల్లో, జనసేన శ్రేణుల్లో సంబరాలే.
Read Also : Navratri: దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా పూజిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా?