HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rajahmundrys Road Cum Rail Bridge Completes 50 Years

Rajahmundry Bridge : 50 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమండ్రి ‘రోడ్ కం రైల్ బ్రిడ్జి’

Rajahmundry Bridge : ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండో రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జ్ పొడవు రైలు మార్గం 2.8 కి.మీ, రోడ్ మార్గం 4.1 కి.మీ. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు

  • Author : Sudheer Date : 25-11-2024 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajahmundry Road Cum Railwa
Rajahmundry Road Cum Railwa

గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జి (Rajahmundry Bridge) 50 వసంతాలు (50yrs) పూర్తి చేసుకుంది. 1974లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండో రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జ్ పొడవు రైలు మార్గం 2.8 కి.మీ, రోడ్ మార్గం 4.1 కి.మీ. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు.

మరి 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రాజమండ్రి ‘రోడ్ కం రైల్ బ్రిడ్జి’ (Rajahmundry Bridge) విశేషాలు తెలుసుకుందాం

ఈ రోడ్-కమ్-రైల్వే బ్రిడ్జి గోదారమ్మకు మణిహారంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలు, ప్రత్యేకంగా రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిర్మించబడిన ఈ వంతెన 1974 నవంబర్ 23 న అప్పటి రాష్ట్రపతి ఫ్రకుద్దీన్ అలీ అహ్మద్ చేత జాతికి అంకితం చేయబడింది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వంతెన రాజమండ్రి వద్ద ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఈ వంతెన భారతదేశంలో అతి పొడవైన రైల్-కమ్-రోడ్ బ్రిడ్జిలలో మూడవది. మొదటి వంతెన అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై, రెండో వంతెన బిహార్‌లో సోన్‌పూర్ వద్ద నిర్మించబడినవి. 1964లో పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు-రాజమండ్రి మధ్య ఈ వంతెనను నిర్మించాలని నిర్ణయించారు. అప్పటివరకు గోదావరి నదిని దాటేందుకు ప్రయాణాలు లాంచీలపైనే జరిగేవి.

ఈ వంతెన నిర్మాణం 1974 ఆగస్టులో పూర్తయింది. రైలు మార్గం 2.8 కి.మీ మరియు రోడ్ మార్గం 4.1 కి.మీ పొడవు ఉంది. ఈ వంతెన ప్రారంభోత్సవాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ బ్రిడ్జి ప్రారంభం కావడంతో కొవ్వూరు-రాజమండ్రి మధ్య షటిల్ బస్సులు ప్రారంభించబడ్డాయి. అందులో ఉభయ గోదావరి జిల్లాలు నేరుగా అనుసంధానమయ్యాయి. దీంతో పాటు పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది.

దశాబ్దాల తరబడి రైలు, రోడ్డు బ్రిడ్జిగా సేవలందించిన ఈ వంతెన సరైన నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా పాడైంది. సెంట్రల్‌ క్యారేజ్‌ వే, వయాడక్ట్‌ భాగంతో పాటు వంతెన అప్రోచ్‌లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం సెప్టెంబర్ 27 నుంచి నవంబర్ 10 తేదీ వరకు బ్రిడ్జిని మూసివేశారు. తాజాగా మరమ్మతులు పూర్తికావడంతో…45 రోజుల తర్వాత తిరిగి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహన రాకపోకలు మొదలయ్యాయి.

Read Also : Constitution Day 2024 : భారత రాజ్యాంగం@75 ఏళ్లు.. రేపు పార్లమెంటు, సుప్రీంకోర్టులో ప్రధాని ప్రసంగం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • longest road-cum-rail bridge
  • rajahmundry
  • Rajahmundry Bridge
  • Rajahmundry Bridge details
  • Rajahmundry Bridge distance
  • Rajahmundry road come Railway bridge length

Related News

Tender coconut claims a life

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd