Whats Today : వరంగల్‌లో రాహుల్ పర్యటన.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Whats Today : ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
- Author : Pasha
Date : 17-11-2023 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
Whats Today : ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు రాహుల్ చేరుకుంటారు. నర్సంపేట బహిరంగ సభలో పాల్గొని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 3.40 గంటలకు మామునూరు విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. అనంతరం వరంగల్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు, మండిబజారు మీదుగా పోచమ్మమైదాన్ వరకు పాదయాత్రలో రాహుల్ పాల్గొంటారు. పోచమ్మమైదాన్ సెంటర్‌లో జరిగే కార్నర్ మీటింగ్ లో రాహుల్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.15 గంటకు హెలికాప్టర్‌లో రాహుల్ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
- అంతకుముందు రాహుల్ గాంధీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో పర్యటిస్తారు. గన్నవారం విమానాశ్రయం నుంచి మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 12 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో జరిగే కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.
- ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ పరకాలలో సీఎం కేసీఆర్ సభ ఉంది. పరకాల శివారులో సీఎం సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. దీంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
- ఇవాళ రాత్రి తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 10.30కి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేయనున్నారు. గద్వాల్, నల్గొండ , వరంగల్‌లలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం హైదరాబాద్ లో ఎంఆర్‌పీఎస్ జాతీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారు.
- ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏలూరు జిల్లాలోని నూజివీడుకు వెళ్తున్నారు. అక్కడ అసైన్‌మెంట్ భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 2003 నాటి అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పిస్తారు. అలాగే కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాలను పంపిణీ చేస్తారు.
- ఇవాళ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో నిండిపోయి, వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
- ఇవాళ నాగుల చవితి సందర్భంగా తిరుమలలో పెద్ద శేష వాహనం ఉరేగింపు ఉంది. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి దర్శనం(Whats Today) ఇస్తారు.