Operation Sindoor: తిరంగా ర్యాలీకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కు పురందేశ్వరి పిలుపు!
ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్ణయించారు.
- By Kode Mohan Sai Published Date - 03:26 PM, Thu - 15 May 25

దేశ వ్యాప్తంగా భారత జవాన్లకు సంఘీభావంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ సింధూర్” కార్యక్రమం కింద, విజయవాడలో శుక్రవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజి సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ర్యాలీలో కూటమి నేతలు కూడా పాల్గొనాలని పురంధేశ్వరి వారికి ఆహ్వానం తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆమె వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా ఆహ్వానించారు. దీనికి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించి, ర్యాలీలో పాల్గొంటానని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారని పురంధేశ్వరి వెల్లడించారు. ఇక వ్యోమికా సోఫియా ఖురేషీపై కొందరు నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు.