Naga Babu : పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబుకు నిరసన సెగ
నియోజకవర్గంలోని కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లిన నాగబాబును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి.. జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. నాగబాబు పర్యటనలో 150 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారని తెలుస్తోంది.
- By Latha Suma Published Date - 01:49 PM, Sat - 5 April 25

Naga Babu : పిఠాపురంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే, ఆయనకు టీడీపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లిన నాగబాబును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి.. జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. నాగబాబు పర్యటనలో 150 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారని తెలుస్తోంది.
Read Also: Salman Khan : పవన్ డైరెక్టర్ తో సల్మాన్ ..?
నాగబాబు పిఠాపురం పర్యటనలలో అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు బల ప్రదర్శన చేస్తుండటంతో ఓ దశలో టీడీపీ, జనసైనికుల మధ్య తోపులాట సైతం జరిగింది. ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు. నాగబాబు పర్యటనలో టీడీపీ కార్యకర్తలు బల ప్రదర్శన చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించింది ప్రజలే అని, ఇతరుల పాత్ర లేదని గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం తాజాగా కనిపిస్తోంది. నాగబాబు పర్యటనలో ఇదే తమకు ఛాన్స్ అన్నట్లుగా టీడీపీ శ్రేణులు వీలు చిక్కినప్పుడల్లా బల ప్రదర్శనకు దిగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
మరోవైపు వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడం ఆయన అభిమానులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పవన్ కళ్యాణ్ ను హైలైట్ చేయాలని జనసైనికులు ప్రయత్నిస్తున్నారని కూటమిలోని టీడీపీ శ్రేణులు, వర్మ మద్దతుదారులు బహిరంగంగా సైతం ప్రకటనలు చేయం తెలిసిందే. ఇక, ఈ క్రమంలోనే పిఠాపురంలో ప్రజలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించారని, జనసేనాని విజయంలో ప్రజలదే కీలకపాత్ర అని నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆయన ప్రచారంలో ప్రభావం చూపుతున్నాయి. ఇతరుల ప్రభావం లేదని చెప్పడం, మాజీ ఎమ్మెల్యే వర్మకు క్రెడిట్ దక్కకుండా చేయడమేనని టీడీపీ కార్యకర్తల అభిప్రాయం అన్నట్లు తెలుస్తుంది.
Read Also: Harsha Kumar : మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు నమోదు