AP : వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే..!!
- By Sudheer Published Date - 08:26 PM, Thu - 28 December 23

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు..పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 05 నుండి బాబు..వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మొదటి సీఎం గా చంద్రబాబు గెలువగా..రెండోసారి మాత్రం రాష్ట్ర ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు మూడో సారి ఎవరికీ ప్రజలు పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి 175 కు 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ చూస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టారు. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీ గా ఉన్నారు.
ఇటు చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లు ఇద్దరు ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే కార్యాచరణ , అభ్యర్థుల ఎంపిక , ప్రచారం..ఉమ్మడి మేనిఫెస్టో ఇలా అన్నింటిపై చర్చలు జరిపిన అధినేతలు.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ముందుగా చంద్రబాబు తన ప్రచారాన్ని మొదలుపెడుతున్నారు. జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు బాబు సన్నద్ధమవుతున్నారు. జనవరి 05 నుండి వరుసగా బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబదించిన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక బహిరంగ సభ, మరొక రోజు రెండు బహిరంగ సభలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక చంద్రబాబు షెడ్యూల్ చూస్తే..
- జనవరి 5న ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో భారీ బహిరంగ సభ
- జనవరి 7న విజయవాడ పార్లమెంట్ తిరువూరు, నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంటలో బహిరంగ సభలు
- జనవరి 9న తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగడ్డలో బహిరంగ సభలు
- జనవరి 10న కాకినాడ పార్లమెంటు పరిధిలోని పెద్దాపురం, శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.
జనవరి 29 కల్లా 25 సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో జరిగే సభలకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభల్లో టీడీపీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ను ప్రజలకు తెలియజేస్తూ.. ఐదేళ్ల వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలకు పలు హామీలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Read Also :