Prakasam Barrage : హమ్మయ్య..బొట్లు బయటకు వస్తున్నాయి
Prakasam Barrage: ఫైనల్ గా బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు (Bekem Infra Engineers) వాటిని బయటకు తీసుకరావడం లో సక్సెస్ అయ్యారు.
- By Sudheer Published Date - 10:34 AM, Wed - 18 September 24

Prakasam Barrage Boat Removal Latest Update : ఇటీవల వరదల సమయంలో విజయవాడలో కృష్ణా నదికి అడ్డంగా ప్రకాశం బ్యారేజీని మూడు బొట్లు ఢీ (Prakasam Barrage Boat Crash) కొని అడ్డంగా చిక్కుకున్న సంగతి తెలిసిందే. వీటిని తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విఫలం అయ్యాయి. ఫైనల్ గా బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు (Bekem Infra Engineers)
వాటిని బయటకు తీసుకరావడం లో సక్సెస్ అయ్యారు.
వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు మొత్తం 70 గేట్లను తెరిచినప్పుడు సెప్టెంబర్ 1న 67, 69 , 70 గేట్ల వద్ద నాలుగు పడవలు బ్యారేజీలోకి దూసుకెళ్లాయి. మరో బోటు ఎక్కడుందో గుర్తించే ప్రయత్నం జరుగుతుండగా ఒక బోటు గేట్ల మధ్య కిందకు దిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బోట్లు బ్యారేజీ 69వ గేట్ కౌంటర్ వెయిట్‌ను ధ్వంసం చేశాయి. అయితే గేట్ల ప్రధాన నిర్మాణాలు దెబ్బతినలేదు. విధ్వంసానికి పాల్పడ్డారనే అనుమానంతో మూడు బోట్ల యజమానితో సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత పడవలను తొలగించే ఆపరేషన్ చేపట్టారు. మూడు పడవల యజమాని ఉషాద్రి, వైసీపీ నేత కోమటి రామ్మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచగా, వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇక బ్యారేజ్ లో చిక్కుకున్న బోట్లను బయటకు తీసుకరావాలని గత కొద్దీ రోజులుగా అధికారులు ట్రై చేస్తూనే ఉన్నారు. పలు ప్లాన్స్ చేసినప్పటికీ వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా బెకెం ఇన్‌ఫ్రా ఇంజినీర్లు (Bekem Infra Engineers) సక్సెస్ సాధించారు. మొత్తం మూడు బోట్లలో నుంచి ఓ బోటును విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. 40 టన్నుల భారీ బరువున్న బోటును ఒడ్డుకు చేర్చామని, ఇక మిగిలిన బోట్లను కూడా త్వరలో బయటకు తీయడానికి ప్రయత్నిస్తామని ఇంజినీర్లు తెలిపారు.
Read Also :