HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Poster Hulchal In Vijayawada Parlament

Vijayawada TDP : బెజ‌వాడ టీడీపీలో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం.. సిట్టింగ్ ఎంపీ లేకుండానే..!

బెజ‌వాడ టీడీపీలో వ‌ర్గ‌పోరు రోజురోజుకి ముదురుతుంది. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోస్ట‌ర్లు

  • Author : Prasad Date : 11-04-2023 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

బెజ‌వాడ టీడీపీలో వ‌ర్గ‌పోరు రోజురోజుకి ముదురుతుంది. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోస్ట‌ర్లు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. 7 అసెంబ్లీ ఇంఛార్జ్‌ల ఫోటోల‌తో కేశినేని చిన్ని ఫోటోల‌తో ఉన్న పోస్ట‌ర్లు హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ అయిన ఎంపీ కేశినేని నాని ఫోటోలు లేకుండానే పోస్ట‌ర్లు అంటించారు.అయితే విజ‌య‌వాడ ఈస్ట్‌, జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జ్‌ల‌కు తెలియ‌కుండానే వారి ఫోటోల‌తో పోస్ట‌ర్లు కొట్టించి కేశినేని చిన్ని బ్యాచ్ అంటిస్తున్నార‌ని క్యాడ‌ర్ ఆరోపిస్తుంది. ఇటు తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఉన్న ఇంఛార్జ్ శావ‌ల దేవ‌ద‌త్ ఆఫీస్ నుంచే ఈ పోస్ట‌ర్లు అంటించేంద‌కు ఏర్పాట్లు చేశార‌ని అక్క‌డి నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇటు మైల‌వ‌రం, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో దేవినేని ఉమా, బొండా ఉమాలు కేశినేని చిన్ని ని ప్రోత్స‌హిస్తూ పార్ల‌మెంట్ ప‌రిధిలో క్యాడ‌ర్‌ని అయోమ‌యానికి గురి చేస్తున్నార‌ని టీడీపీ క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.

సిట్టింగ్ ఎంపీ ఉండ‌గానే అయ‌న ఫోటో లేకుండా ఎలా పోస్ట‌ర్లు వేస్తార‌ని ఎంపీ కేశినేని నాని వ‌ర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ విష‌యంపై ఎంపీ కేశినేని నాని మాత్రం మౌనం వ‌హిస్తున్నారు. గ‌తంలో కార్పోరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతోనే ఎంపీ కేశినేని ఈ విష‌యాల‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డంలేద‌ని తెలుస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఈ వ‌ర్గ‌పోరుని క‌ట్ట‌డి చేయ‌డంపై దృష్టి పెట్ట‌డం లేదు. ఇదే విధంగా ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే పార్ల‌మెంట్ ప‌రిధిలో టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర్గాల‌తో పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతుంది. కాబ‌ట్టి అధిష్టానం దీనిపై త్వ‌ర‌గా ఫోక‌స్ పెట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • Lokesh
  • TDP MP
  • TDP MP kesineni nani
  • vijayawada

Related News

Indrakeeladri

Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • MAHANADU

    TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd