Police Special Treatment to Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కు సంబంధించి మరో వీడియో హల్చల్..
Police Special Treatment : 'ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ' పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో ఏదో చెప్పినట్లు వీడియోలో కనిపించింది
- By Sudheer Published Date - 12:09 PM, Wed - 13 November 24

వైసీపీ నేత, రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil) కు పోలీసులు సకల మర్యాదలు (Police Special Treatment) చేస్తున్నారని ఇప్పటికే పలు వీడియోలు బయటకు రాగా..తాజాగా మరో వీడియో బయటకు వచ్చి హలచల్ చేస్తుంది. ఈ వీడియో లో తన చెల్లెలి కుమారుడితో పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమక్షంలోనే ముచ్చటించినట్లు కనిపిస్తుంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు అనిల్‌కుమార్ గుంటూరులోని అరండల్‌పేట స్టేషన్‌లో కస్టడీలో ఉండగా, అతని మేనల్లుడు లోపలికి ప్రవేశించగానే అనిల్ చిరునవ్వు చిందిస్తూ ‘ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ’ పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో ఏదో చెప్పినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితుడిని బయటి వ్యక్తి వచ్చి కలవడం పోలీసుల నిర్లక్ష్యమా, లేక అతనికి దాసోహమా అన్నప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
గుంటూరులోని ఏఈఎల్‌సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబూప్రకాశ్‌ను 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో అరండల్‌పేట పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తరలించి, అక్టోబర్ 26 నుంచి 29 వరకు అరండల్‌పేట స్టేషన్‌లో విచారించారు. ఆ సమయంలో అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లు ఇటీవల సీసీ ఫుటేజీ బయటకు వచ్చాయి. స్టేషన్లోనే ప్రత్యేకంగా దిండుతో పడక ఏర్పాటు చేయడం, పోలీసులకే నిందితుడు ఆర్డర్లు వేయడం అతను చెప్పిన దానికల్లా తలూపడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అంతకు ముందు కూడా ఓ రెస్టారెంట్ లో అనిల్ కు విందు భోజనం పెట్టడం పట్ల కూడా పోలీసులపై విమర్శలు వచ్చాయి. మరి అనిల్ కు ఎందుకు ఇంత మర్యాదలు చేస్తున్నారు..అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Toyota Vellfire: టయోటా వెల్‌ఫైర్ కొన్న స్టార్ హీరో.. దీని ప్రత్యేకత ఏమిటంటే?