Stone Attack on Jagan : జగన్ ఫై దాడి చేసినవారిని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి
రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు
- Author : Sudheer
Date : 15-04-2024 - 2:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్ ఫై జరిగిన రాయి దాడి (Stone Attack on Jagan) ఫై పోలీసులు (Police) దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ ఘటన కు సంబదించిన నలుగుర్ని అదుపులోకి తీసుకొని (police arrested four people) విచారిస్తున్నారు. ఇదిలా ఉండగానే జగన్ పై రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత కొద్దీ రోజులుగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా శనివారం విజయవాడలో యాత్ర చేస్తుండగా.. జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి బలంగా రాయి విసరడంతో జగన్ కనుబొమ్మకు తగిలి గాయమైంది. జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. వెంటనే జగన్‌కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర ముఖ్యమంత్రి కొనసాగించారు. అనంతరం వైద్యుల సలహామేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి తగిలిన గాయానికి చికిత్స తీసుకున్నారు. నిన్న రిస్ట్ తీసుకున్న జగన్..ఈరోజు తిరిగి తన యాత్రను మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా జగన్ ఫై దాడి కేసులో పోలీసులు నలుగుర్ని అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదుపులో ఉన్న నిందితుల్లో రౌడీషీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలోని అన్ని చోట్ల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన టైంలో కరెంటు లేకపోవడం దర్యాప్తుకు ప్రధాన అడ్డంకిగా మారిందంటున్నారు పోలీసులు. రోడ్‌షో జరిగిన ప్రాంతంలో ఉన్న పాఠశాల నుంచే రాయి విసిరినట్టు నిర్దారించిన పోలీసులు అక్కడ ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు. ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామని, వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.

Read Also : Loksabha Elections : రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ధారించే ఎన్నికలుః ప్రధాని మోడీ