Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాద ఘటన ఫై మోడీ దిగ్బ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex Gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.
- By Sudheer Published Date - 11:10 AM, Mon - 30 October 23

ఆదివారం విజయనగరం (Vizianagaram Train Accident) జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద మూడు లైన్లు ఉండగా మధ్య లైనులో సిగ్నల్ కోసం రైలు నిలిచింది. ఇదే క్రమంలో వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ – పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి.
కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా (14 Dies), 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో 35 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని సమాచారం. రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. ప్రస్తుతం గాయపడిన వారికీ పలు హాస్పటల్స్ లలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ఘటన పట్ల ప్రధాని మోడీ (PM Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా (Ex gratia) ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే సీఎం జగన్ (CM Jagan)సైతం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించడమే కాకుండా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది సర్కార్. అలాగే రైలు ప్రమాద ఘటన ఫై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Read Also : Gang Rape: 19 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు 20 రోజులు అత్యాచారం